Vishwambhara: చిరంజీవికి జోడీగా స్టార్ హీరోయిన్ ఫిక్స్.. అప్పుడు వద్దని తీసేసి ఇప్పుడేమో!
సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎంతో వేగంగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తూ దూసుకుపోతోన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇలా ఇప్పటికే చాలా సినిమాలతో ప్రేక్షకులను, అభిమానులను అలరించిన ఆయన.. గత ఏడాది 'వాల్తేరు వీరయ్య', 'భోళా శంకర్' మూవీలతో మెగాస్టార్ చిరంజీవి వచ్చారు. ఇందులో ఒకటి హిట్ అవగా.. మరొకటి డిజాస్టర్‌గా మిగిలిపోయింది.
'భోళా శంకర్' మూవీతో నిరాశ పరిచిన మెగాస్టార్ చిరంజీవి.. ఈ సారి ఎలాగైనా భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇందులో భాగంగానే తన 156వ సినిమాను కల్యాణ్ కృష్ణతో ప్రకటించారు. కానీ, ఎందుకనో ఆ ప్రాజెక్టును పట్టాలెక్కించలేదు. కానీ, ఇప్పుడు ఆయన 'బింబిసార' మల్లిడి వశిష్ట దర్శకత్వంలో 'విశ్వంభర' అనే సినిమాను చేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి - మల్లిడి వశిష్ట కాంబినేషన్‌లో రాబోతున్న 'విశ్వంభర' మూవీ సోషియో ఫాంటసీ జోనర్‌లో తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించి ముందుగా కాన్సెప్టు పోస్టర్‌ను వదిలి.. ఆ తర్వాత పూజా కార్యక్రమాలను జరిపారు. ఇక, కొద్ది రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను కూడా మొదలు పెట్టి.. ఓ షెడ్యూల్‌ను కూడా కంప్లీట్ చేశారు.

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న 'విశ్వంభర' మూవీ షూటింగ్ కూడా ప్రారంభం కావడంతో ఇందులో నటించే హీరోయిన్ విషయంలో క్లారిటీ రాలేదు. కానీ, ఇందులో ఫలానా హీరోయిన్ నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది స్టార్ల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా 'విశ్వంభర' హీరోయిన్‌పై క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న 'విశ్వంభర' మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా చేస్తున్నట్లు తాజాగా న్యూస్ బయటకు వచ్చింది. ఇప్పటికే ఈమె ఎంపిక కన్ఫార్మ్ అయిందని, త్వరలోనే షూటింగ్‌లో కూడా పాల్గొనబోతుందని తెలుస్తోంది. గతంలో కాజల్ 'ఆచార్య' మూవీకి కూడా సెలెక్ట్ అయింది. కానీ, ఆమెను తొలగించారు. ఇప్పుడు మళ్లీ చిరంజీవి ఛాన్స్ ఇచ్చారు.

ఇదిలా ఉండగా.. మెగాస్టార్ చిరంజీవి - వశిష్ట కలిసి చేస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో కాజల్ అగర్వాల్ సహా మరికొందరు హీరోయిన్లుగా నటిస్తున్నట్లు తెలిసింది. అలాగే, దగ్గుబాటి రానా విలన్‌గా చేస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఇటీవలే ఈ మూవీ నుంచి వచ్చిన గ్లింప్స్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇది వచ్చే సంక్రాంతికి రాబోతుంది.


Click it and Unblock the Notifications











