అప్పుడు ఎన్టీఆర్.. ఇప్పుడు అల్లు అర్జున్.. భాగమవుతున్న కాజల్
కాజల్ అగర్వాల్.. స్టార్ హీరోయిన్ అయినప్పటికీ చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరు హీరోలతో నటించేందుకు సిద్ధంగా ఉంటుంది. హీరోయిన్ కాకపోయినా ఐటెం సాంగ్ అన్నా ఈ మధ్య ఓకే చేసేస్తోంది ఈ సీనియర్ ముద్దుగుమ్మ. ఈ నేపథ్యంలోనే గతంలో ఎన్టీఆర్‌తో జనతా గ్యారేజ్ సినిమాలో ఐటెం సాంగ్ చేసిన ఈమె ఇప్పుడు అల్లు అర్జున్‌తో 'అల.. వైకుంఠపురములో' సినిమాలో కూడా ఐటెం సాంగ్ చేయనుందని తెలుస్తోంది.
స్పెషల్ ఎఫెక్ట్‌తో మాస్ ఆడియన్స్‌ని ఉర్రూతలూగించేలా ఈ సాంగ్ చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. ఇందుకోసం కాజల్‌కి పారితోషికం కూడా బాగానే ఇచ్చుకుంటున్నారని తెలుస్తోంది. సంక్రాంతికి విడుదల కానున్న 'అల.. వైకుంఠపురములో' సినిమా కోసం డైరెక్టర్ త్రివిక్రమ్, అల్లు అర్జున్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారట.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్‌లో ఈ సినిమా రూపొందుతుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్, హారిక&హాసిని క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. సుశాంత్, నివేదా పేతురాజ్, టబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇక ఈ చిత్రంలో అల్లు అర్జున్ రెండు డిఫెరెంట్ షేడ్స్ లో కనిపించనున్నాడని, ఆయన డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడనే మరో వార్త ప్రచారంలో ఉంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం చ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా విడుదల కానుంది. అల్లు అర్జున్ కెరీర్‌లో 19వ సినిమాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











