Don't Miss!
- News శక్తివంతమైన లక్ష్మీనారాయణ యోగం.. ఈ రాశులపై కనక వర్షం
- Finance Gold Rate: గుడ్‌న్యూస్.. కుప్పకూలిన పసిడి ధర.. నేడు రూ.15,300 తగ్గిన గోల్డ్ రేటు..
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
- Sports జైస్వాల్.. వాళ్లపై ఎందుకంత కక్ష?- సునీల్ గవాస్కర్
- Lifestyle Mango Tea: ఇకపై తొక్కేకదా అని పారేయకండి.. ఇలా టీ చేసుకుని తాగండి..శరీరంలో జరిగే అద్భుతాలు చూడండి..
- Technology శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ డిస్ప్లేలో గ్రీన్ లైన్ కనిపిస్తోందా.. అయితే ఉచితంగా స్క్రీన్ రీప్లేస్ చేస్తారు...
- Automobiles ఎన్నో అంచనాల మధ్య లాంచ్ అయిన క్లచ్‌లెస్ బైక్ TVS Jive.. ఎందుకు ఫెయిల్ అయింది.??
మళ్లీ ఇన్నేళ్లకు ప్రభాస్‌తో కాజల్.. ఆ విషయంలో దక్షిణాది నుంచి డార్లింగ్ ఒక్కడే
బాహుబలి, సాహో లాంటి చిత్రాలతో ప్యాన్ ఇండియా హీరోగా ఎదిగాడు ప్రభాస్. బాహుబలి తెచ్చిపెట్టిన క్రేజ్‌తో ఎక్కడికో ఎదిగిన ప్రభాస్.. సాహోతో అందరి అంచనాలు అందుకోవడంతో కాస్త తడబడ్డాడు. కానీ ప్రభాస్‌కు ఉన్న మాస్ ఫాలోయింగ్‌తో బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది. ఒకవేళ సినిమా కథ బాగుందనే టాక్ వస్తే రికార్డుల మోత మోగేవి. అయినా సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా ప్రభాస్ ఇమేజ్ పెరుగుతూనే ఉంది.
సెక్సీయెస్ట్ పర్సన్..
ప్రతీ ఏడాది సెక్సీయెస్ట్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అంటూ ఓ లిస్ట్ విడుదల చేస్తుందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆసియా మొత్తంలో ఉన్న సెలెబ్రిటీల లిస్ట్‌లో ప్రతీసారి హృతిక్ రోషన్ మొదటి స్థానాన్ని దక్కించుకుంటాడన్న విషయం కూడా తెలిసిందే. ఈ ఏడాది కూడా ఆ లిస్ట్‌ను ప్రకటించేశారు.
Recommended Video
దక్షిణాది నుంచి ఒకే ఒక్కడు..
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానుల ఓట్లతో పాటు.. ఈ ఏడాది ఎక్కువ ప్రభావం చూపే హీరోలు అనే లిస్ట్‌ను తయారు చేసింది. ఈ లిస్ట్ లో టాప్ 10 ప్లేస్‌ను దక్కించుకున్నాడు ప్రభాస్. సౌత్‌లో మరే హీరోకి ఈ లిస్ట్‌లో ప్లేస్ దక్కలేదు. కేవలం ప్రభాస్‌కు మాత్రమే ఆ గౌరవం దక్కింది.
జాన్‌తో బిజీగా..
రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ జాన్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. వింటేజ్ లవ్‌స్టోరిగా వస్తోన్న ఈ సినిమాలో ప్రభాస్ ఇద్దరితో రొమాన్స్ చేయనున్నాడని టాక్. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుంది. ఇప్పటికే ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోండగా.. తాజా సమాచారం ప్రకారం ఇందులో పూజా హెగ్డేతో పాటు మరో భామ కూడా నటించనుందని తెలుస్తోంది.
ఇన్నేళ్లకు మళ్లీ ప్రభాస్‌తో
పునర్జన్మల నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలోని కీలక సన్నివేశాల్లో ప్రభాస్ సరసన కాజల్ కనిపిస్తారని సమాచారం. దీనిపై ఇంకా చిత్రబృందం నుంచి అధికారి ప్రకటన అయితే వెలువడలేదు. ఇది అలా ఉంటే ప్రభాస్, కాజల్ జోడీకి టాలీవుడ్లో మంచి క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. వీరిద్దరు కాంబినేషన్లో వచ్చిన డార్లింగ్, మిస్టర్ ఫర్ఫెక్ట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకున్నాయి.