అందరూ కలిసి కాజల్ పెళ్లి చెడగొట్టేశారుగా.. ముఖ్యంగా ఆ సీనియర్ హీరోలే?
టాలీవుడ్ చందమామగా తనకంటూ ఆమె ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ కాజల్ అగర్వాల్. ఇండస్ట్రీలో అడుగుపెట్టి పధమూడేళ్లయినా కూడా ఇంకా ఆమె క్రేజ్ తగ్గలేదు. ఎంతో మంది హీరోయిన్స్ వస్తున్నారు పోతున్నారు. కానీ కాజల్ రేంజ్ మాత్రం తగ్గడం లేదు. వరుసగా ఆఫర్స్ అందుకుంటూ నేటితరం యంగ్ హీరోయిన్స్ కి మంచి పోటీని ఇస్తోంది.

సేఫ్ జోన్ గర్ల్..
లక్ష్మీ కళ్యాణం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ మొదటి సినిమా సక్సెస్ కాకపోయినప్పటికి ఆఫర్స్ రావడం ఎప్పుడు తగ్గలేదు. సినిమా సినిమాకు తన రేంజ్ ని పెంచుకుంటూ వెళుతూనే ఉంది. జయపజయలతో సంబంధం లేకుండా సేఫ్ జోన్ లో తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న కథలనే సెలెక్ట్ చేసుకుంటూ కెరీర్ ని ఒక ట్రాక్ లో సెట్ చేసుకుంది.

అందరి హీరోలతో..
దాదాపు టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలందరితో కాజల్ జత కట్టింది. త్వరలో మిగిలిన మరికొంత మందితో కూడా బిగ్ స్క్రీన్ పై రొమాన్స్ చేయనుంది. ఇక మెగా ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీలో స్టార్ హీరోలను కవర్ చేసిన అమ్మడు నేటితరం యంగ్ హీరోస్ తో కూడా వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతోంది.

పెళ్లి చేసుకోవాలని..
అసలైతే గత ఏడాదిలోనే కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకోవాలని అనుకుంది. ఇప్పటికే చెల్లి పెళ్లి చేసిన కాజల్ తను కూడా మ్యారేజ్ లైఫ్ లోకి వెళ్లాలని ఒక ప్లాన్ వేసుకుందట. కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చిందట. అప్పట్లో కాజల్ ఒక బడా బిజినెస్ మెన్ ని లైన్ లో పెట్టినట్లు కథనాలు వచ్చాయి. కానీ అమ్మడు ఆ రూమర్స్ పై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
Recommended Video

వాళ్లే చెడగొట్టేస్తున్నారు..
కాజల్ అనుకున్న సమయానికి పెళ్లి చేసుకోకపోవడానికి కారణం స్టార్ హీరోలే.. విక్టరీ వెంకటేష్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి సైతం కాజల్ అగర్వాల్ ని నెక్స్ట్ సినిమాల కోసం సెలెక్ట్ చేసుకున్నారు. ఇక బాలీవుడ్ లో కూడా ఆఫర్స్ వస్తుండడంతో కాజల్ బిజీగా మారి పెళ్లిని వాయిదా వేసుకుంటోంది. సీనియర్ హీరోలు ఎక్కువగా కాజల్ అయితేనే తమకు కరెక్ట్ గా సెట్టవుతుందని ఏరికోరి సెలెక్ట్ చేసుకుంటున్నారు. దీంతో తెలియకుండానే వారు కాజల్ పెళ్లికి అడ్డుపడుతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.


Click it and Unblock the Notifications











