Acharya వేడుకలో కాజల్ అగర్వాల్ పేరే ఎత్తని యూనిట్.. అసలు ఏం జరిగింది?
మెగాస్టార్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ఆచార్య త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ జోరు పెంచిన సినిమా యూనిట్ తాజాగా పెద్ద ఎత్తున ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించింది. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముందు నుంచి ఈ సినిమాలో హీరోయిన్ అని ప్రచారం జరుగుతున్న కాజల్ అగర్వాల్ పేరు ఎత్తకపోవడం ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

భారీ అంచనాలు
మెగా స్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన తాజా చిత్రం ఆచార్య. మెగా పవర్ స్టార్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 29న ఆచార్య గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతున్న క్రమంలో ఇప్పటికే ఈ సినిమా యూనిట్ ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టింది. ఇప్పటికే సినిమా నుంచి పలు పోస్టర్స్, టీజర్, ట్రైలర్, పాటలు విడుదల చేయగా అవన్నీ కూడా మంచి హిట్ అయ్యాయి. అలాగే సినిమా మీద మంచి అంచనాలు కూడా ఏర్పాటయ్యాయి.

ఒక విషయం గురించి
అయితే శనివారం నాడు రోజు హైదరాబాదులోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించింది సినిమా యూనిట్. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిరంజీవి తదుపరి చిత్రాల దర్శకులు బాబీ, మెహర్ రమేష్, మోహన్ రాజా కూడా అతిథిలుగా ఈ ఈవెంట్ కి హాజరయ్యారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ అంతా బాగానే జరిగింది. కానీ ఒక విషయం గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది.

కాజల్ అగర్వాల్
ఎందుకంటే ఈ సినిమా మొదట్లోనే చిరంజీవికి జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తోందని అధికారికంగా ప్రకటించారు. అయితే నిన్న జరిగిన ఈవెంట్ లో ఆమె పేరు అసలు ప్రస్తావించలేదు. నిజానికి కాజల్ ఇటీవలే తల్లి కావడంతో ఆచార్య ప్రచార కార్యక్రమాలకు హాజరు కావడం లేదు అనుకుందాం. కానీ ఆమె గురించి పేరు కూడా ప్రస్తావించక పోవడం చర్చనీయాంశం అయింది.

కాజల్ అగర్వాల్
అదే కాదు ఈ మధ్య ఆచార్య సినిమా ట్రైలర్ ఇటీవల రిలీజై మంచి రెస్సాన్‌ను సొంతం చేసుకుంది. అయితే అందులో సైతం కాజల్ కనిపించకపోవడం పై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. పూజా హెగ్డే కాస్తో కూస్తో ట్రైలర్ లో మెరిసింగి కానీ మెయిన్ హీరోయిన్ అని చెప్పబడుతున్న కాజల్ కనిపించకపోవడంపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఆచార్య సినిమాను 3 గంటల నిడివి నుంచి దాదాపు 15 నిమిషాలు కట్ చేసి 2 గంటల 45 నిమిషాలకు కుదించడంతో కాజల్ అగర్వాల్ ఉండే సీన్లను లేపేయాల్సి వచ్చిందని అంటున్నారు.

బాగా కలిసి వచ్చిన హీరోయిన్
అయితే నిజానికి మెగా ఫ్యామిలీకి కాజల్ అగర్వాల్ బాగా కలిసి వచ్చిన హీరోయిన్ అనే చెప్పాలి. కాజల్ మెగా హీరోలతో నటించిన దాదాపు అన్ని చిత్రాలు హిట్ గా నిలిచాయి. ముఖ్యంగా రామ్ చరణ్ తో నటించిన మగధీర, నాయక్ సూపర్ హిట్స్ గా నిలిచాయి. మెగాస్టార్ ఖైదీ నెం 150 లో హీరోయిన్ కాజల్ అగర్వాల్ కాగా ఆ సినిమా కూడా హిట్ అయింది. అలాంటి కాజల్ పేరు కనీసం ప్రస్తావించక పోవడం చర్చనీయాంశం అయింది. కాజల్ తో పాటు ఈ చిత్రంలో విలన్ గా నటించిన సోనూ సూద్ పేరు కూడా వినిపించలేదు.


Click it and Unblock the Notifications











