twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అదే దర్శకుడితో ఏకంగా నాలుగోసారి.. కాజల్ కమిట్‌మెంట్స్

    |

    సినీ ఇండస్ట్రీలో కాంబినేషన్స్ రిపీట్ కావడమనేది సాధారణమే. ఎక్కువగా హీరోలు, డైరెక్టర్ల కాంబినేషన్ రిపీట్ కావడం చూస్తుంటాం. కానీ అందుకు భిన్నంగా డైరెక్టర్, హీరోయిన్ కాంబో అనేది ఎక్కువసార్లు రిపీట్ కావడం అనేది దాదాపు అసాధ్యం. కానీ సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మాత్రం హీరోయిన్లకు కూడా ఇది సాధ్యమే నిరూపించే ప్రయత్నం చేస్తోంది.

    డైరెక్టర్ తేజ, కాజల్ అగర్వాల్ మధ్య మంచి బాండింగ్ ఉంటుంది. తెలుగులో తన మొదటి సినిమాను తేజ తోనే చేసిన కారణంగా కాజల్ అగర్వాల్ కి తేజ అంటే చాలా ఇంట్రెస్ట్. అందుకే ఆయనతో వరుస సినిమాలకు కమిట్ అవుతోంది. మొదటి సినిమా 'లక్ష్మీ కళ్యాణం' తర్వాత కొన్ని రోజులపాటు తేజను పక్కన పెట్టిన గత కొంతకాలంగా మళ్లీ అతన్నే నమ్ముకుంటోంది. రెండు సంవత్సరాల క్రితం తేజ దర్శకత్వంలో వచ్చిన 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలో నటించిన కాజల్.. ఇటీవలే మరోసారి 'సీత' రూపంలో తేజ సెట్స్ పై వాలింది.

    Kajal Aggarwal once again joins with Director Teja

    కానీ తేజ తీర్చిదిద్దిన మోడ్రెన్ సీత.. కాజల్‌కి కలిసి రాలేదు. అయినప్పటికీ మరోసారి తేజతో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమైందట కాజల్. ఆయనతో మరో కొత్త సినిమాకు కాజల్ కమిటైందనేది లేటెస్ట్ సమాచారం. సీత ఫట్ అయింది కాబట్టి కాజల్ అగర్వాల్ కోసం మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ రెడీ చేశాడట తేజ.

    ఇది కూడా సీత లాగే లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ అని తెలుస్తోంది. ఇప్పటి యూత్‌కు కావాల్సిన అంశాలను జోడించి తేజ ఈ కథను కాజల్ వద్దకు తీసుకెళ్లగా ఆమె వెంటనే ఓకే చెప్పేసిందని అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు. ఇదే నిజమైతే తేజ- కాజల్ కాంబోలో రాబోతున్న నాలుగో సినిమా అవుతుంది ఈ చిత్రం. దీనిపై మరికొద్ది రోజుల్లోనే అఫీషియల్ ప్రకటన కూడా రానుందని అంటున్నారు. చూడాలి మరి తేజ ఎలాంటి బాంబు పేలుస్తాడో!

    English summary
    Director Teja and Kajal Aggarwal once again join together for new movie. Their last movie 'Sita'. Sai Srinivas Bellamkonda, Kajal Aggarwal played lead roles in this romantic drama. This movie result has not up to the mark.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X