NBK109: బాలయ్యకు జోడీగా లక్కీ హీరోయిన్.. ఆ సెంటిమెంట్ ప్రకారం ఇది కూడా హిట్టే!
సాధారణంగా సినీ రంగంలో ఒక హిట్‌ను అందుకోవాలంటే చాలా కష్టం. అలాంటిది కొందరు హీరోలు మాత్రం వరుసగా సక్సెస్‌ల మీద సక్సెస్‌లను సొంతం చేసుకుంటున్నారు. అందులో నటసింహా నందమూరి బాలకృష్ణ ఒకరు. ఈ మధ్య కాలంలో హ్యాట్రిక్ విజయాలను ఖాతాలో వేసుకున్న ఆయన.. ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో వరుసగా మూవీలు చేస్తున్నారు.
నటసింహా నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 109వ చిత్రాన్ని బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ 1980 దశకం నాటి కథతో రాబోతోంది. ఈ విషయాన్ని కాన్సెప్టు పోస్టర్‌లో రివీల్ చేశారు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. అందుకు తగ్గట్లుగానే ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

నందమూరి బాలకృష్ణ - బాబీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ను ఆ మధ్యనే ప్రారంభించారు. అప్పటి నుంచి వరుసగా షెడ్యూళ్లను జరుపుతున్నారు. ఇలా ఇప్పటికే 80 శాతం వరకూ టాకీ పార్టును పూర్తి చేసుకున్నారు. మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి సినిమాను జూలైలోనే రిలీజ్ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
బాలయ్య కెరీర్‌లోనే డిఫరెంట్ స్టోరీతో రూపొందుతోన్న ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా ఎవరు చేస్తారన్న దానిపై ఎన్నో రకాల ఊహాగానాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇందులో త్రిష, మీనాక్షి చౌదరిలను ఫిక్స్ చేశారని న్యూస్ వైరల్ అయింది. అలాగే, ప్రియమణి, ప్రియాంక జవాల్కర్, శ్రద్దా శ్రీనాథ్ సహా ఎంతో మంది పేర్లు కూడా తెరపైకి వచ్చినా వాళ్లెవరూ కన్ఫార్మ్ కాలేదు.

క్రేజీ కాంబోలో రూపొందుతోన్న ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుందని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఏపీ ఎలక్షన్ తర్వాత ప్రారంభం కాబోతున్న రెండో షెడ్యూల్‌లో ఈమె కూడా భాగం కాబోతుందని తెలిసింది. గతంలో వీళ్లిద్దరూ కలిసి 'భగవంత్ కేసరి' మూవీ చేశారు. అది హిట్ అవడంతో ఇప్పుడు ఈ మూవీ కూడా సక్సెస్ అవుతుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

ఇదిలా ఉండగా.. బాలయ్య హీరోగా నటిస్తోన్న ఈ సినిమాను సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై సాయి సౌజన్య, నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో ఊర్వశీ రౌటేలా, బాబీ డియోల్, దుల్కర్ సల్మాన్, చాందినీ చౌదరి కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రానికి 'వీర మాస్' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు.


Click it and Unblock the Notifications











