దారుణంగా పడిపోయిన కాజల్ రెమ్యూనరేషన్.. ఎందుకో తెలుసా?

కొద్దిరోజుల క్రితం వరకూ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడిపింది టాలీవుడ్ చందమామ కాజల్. ఇప్పుడు మాత్రం దానికి భిన్నమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఒకవైపు హిట్‌లు లేక మరోవైపు అవకాశాలు రాక ఇబ్బంది పడుతోంది. ఉన్న సినిమాలేమో వివాదాస్పదం అవుతుండడం.. ఎంపికైన సినిమా నుంచి తప్పుకోవడం వంటి వాటితో కాజల్ ఇబ్బందులు పడుతోంది. ఇక, ఈ మధ్య తీసిన సినిమాలు కూడా సరైన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఆమె రెమ్యూనరేషన్ భారీగా పడిపోయిందట. తాజాగా ఓ సినిమాకు ఆమె తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటోంది. ఇంతకీ ఏంటా సినిమా.?

రణరంగం ఏమాత్రం కలిసిరాలేదు

రణరంగం ఏమాత్రం కలిసిరాలేదు

శర్వానంద్ హీరోగా వచ్చిన చిత్రం ‘రణరంగం'. ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ప్రశాంత్ పిళ్లై సంగీతం సమకూర్చారు. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ సినిమా బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టింది. అంతేకాదు, ఇందులో కాజల్‌ పాత్రకు అస్సలు ప్రాధాన్యం ఉండదు. దీంతో ఈ సినిమా ఆమెకు నిరాశనే మిగిల్చింది.

 వివాదంలో మరో సినిమా

వివాదంలో మరో సినిమా

బాలీవుడ్‌లో కంగనా నటించిన ‘క్వీన్' ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఈ సినిమాను అన్ని భాషల్లో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు చేశారు. ఇందులో భాగంగానే తమిళంలో కాజల్ మెయిన్ లీడ్‌గా ‘ప్యారిస్ ప్యారిస్' టైటిల్‌తో తెరకెక్కింది. మీడియంట్‌ ఫిలిం పతాకంపై మనుకుమార్‌ వీటిని నిర్మించారు. మిగిలిన భాషల్లో రాని విధంగా ఈ సినిమాకు మాత్రం సెన్సార్ బోర్డు ‘ఏ' సర్టిఫికెట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన వివాదం నడుస్తోంది.

విష్ణుకు చెల్లెలిగా

విష్ణుకు చెల్లెలిగా

వరుస పరాజయాలతో సతమతమవుతున్న మంచు విష్ణు.. ఒకేసారి నాలుగు ప్రాజెక్టులకు పచ్చ జెండా ఊపిన విషయం తెలిసిందే. అందులో ఒకటి ఈ సినిమా. హాలీవుడ్ దర్శకుడు రూపొందించనున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఇంగ్లీష్, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఈ సినిమాలో కాజల్.. విష్ణుకు చెల్లెలిగా నటిస్తోంది. ఇటీవల జరిగిన రాఖీ పండుగ సమయంలో ఈ విషయం బయటకు వచ్చింది.

బాలీవుడ్ సినిమాకు రూ. 30 లక్షలే

బాలీవుడ్ సినిమాకు రూ. 30 లక్షలే

తాజాగా కాజల్ బాలీవుడ్‌లో ‘ముంబై సాగా' అనే సినిమా చేస్తోంది. సంజయ్ గుప్తా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ, జాన్ అబ్రహం వంటి స్టార్లు నటిస్తున్నారు. ఇందులోనే కాజల్ కీలక పాత్ర పోషిస్తుంది. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఈ సినిమా కోసం కాజల్ రూ. 30 లక్షలు మాత్రమే రెమ్యూనరేషన్‌గా తీసుకుంటుందట. దీంతో అందరూ షాక్ అవుతున్నారు.

ఇక్కడ మాత్రం ఫుల్ డిమాండ్

ఇక్కడ మాత్రం ఫుల్ డిమాండ్

బాలీవుడ్ సినిమాలో తక్కువ రెమ్యూనరేషన్‌కే పని చేస్తున్నా కాజల్.. తెలుగు సినిమాల కోసం మాత్రం భారీగా డిమాండ్ చేస్తుందని టాక్. ఇక్కడ ఆమె రెమ్యూనరేషన్ సుమారు రూ. 1.75 కోట్లు అని తెలిసింది. ఇక, మిగిలిన ఖర్చులు అన్నింటితో కలిపి ఆమెకు రెండు కోట్ల రూపాయల వరకు ముట్టజెబుతున్నారట టాలీవుడ్ ఫిల్మ్ మేకర్లు. ఇక, మొత్తంగా ఇంత తేడా రావడంతో కాజల్ మరోసారి హాట్ టాపిక్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X