twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తమన్నా, నందిత శ్వేత, తాప్సి.. తాజాగా ఆ లిస్టులో కాజల్!

    |

    యాంకర్‌గా ఆడియన్స్‌కి దగ్గరైన ఓంకార్ మెగా ఫోన్ పట్టి దర్శకుడి అవతారమెత్తాడు. డిఫెరెంట్ జానర్‌లో హారర్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనతో 'రాజుగారి గది' సినిమా రూపొందించాడు. ఓంకార్ భావించినట్లు గానే ఈ సినిమా భారీ సక్సెస్ సాధించింది.

    దీంతో ఈ చిత్రానికి సీక్వల్స్ రూపొందించాలని డిసైడ్ అయిన ఓంకార్ 'రాజుగారి గది 2' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అక్కినేని నాగార్జున, సమంత లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు ఆశించిన మేర ఆదరణ లభించలేదు. అయినప్పటికీ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా రాజుగారి గది 3 సినిమాను రూపొందించేందుకు రెడీ అయ్యారు ఓంకార్. హారర్ జానర్ లోనే విభిన్న కథాంశాన్ని ఎన్నుకొని ఈ సినిమాకు స్క్రిప్ట్ రెడీ చేశారట ఓంకార్. జూన్ 20వ తేదీన ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు.

    Kajal Aggarwal Replaced In Tamannaah Role..?

    ఓక్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై తెరకెక్కనున్న ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా, అశ్విన్ లను లీడ్ రోల్స్‌లో సెలెక్ట్ చేశారు. అయితే అనుకోని కారణాల వల్ల ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించింది తమన్నా. దీంతో ఆమె స్థానంలో నందిత శ్వేతను పరిశీలించారట. ఆ తర్వాత తాప్సి పేరును పరిగణలోకి తీసుకున్న ఓంకార్ తాజాగా కాజల్ అగర్వాల్‌ని పరిశీలనలో పెట్టారని తెలుస్తోంది. ఫీమేల్ ఓరియెంటెడ్ హారర్ సినిమా కాబట్టి కాజల్ అగర్వాల్ బాగా సూట్ అవుతుందని ఆయన భావిస్తున్నారట.

    హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న 'రాజుగారి గది 3' చిత్రంలో ఊర్వ‌శి, అలీ, బ్ర‌హ్మాజీ, ప్ర‌భాస్ శ్రీను, హ‌రితేజ‌, అజ‌య్‌ఘోష్ తదితరులు నటించనున్నారు. చిత్రానికి ఛోటా కె.నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందించనున్నారు. గతంలో వచ్చిన రెండు సినిమాను మించి హారర్, కామెడీ ఈ సినిమాలో జోడించనున్నారని తెలుస్తోంది. అతిత్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

    English summary
    Raju Gari Gadhi 3 movie starts regular shooting shortly. This movie is directed by Omkar. Raju Gari Gadhi 3 heroine Tamannaah getback from this project, then Omkar looking to replace with Kajal Aggarwal.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X