NBK108: బాలయ్య మూవీలో కాజల్ రోల్ లీక్.. ఆ సీన్‌కు మాత్రం కన్నీళ్లు ఆగవు
చాలా కాలం పాటు వరుస పరాజయాలతో సతమతం అయినప్పటికీ.. ఈ మధ్య కాలంలో మాత్రం వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతోన్నారు టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నటసింహా నందమూరి బాలకృష్ణ. 'అఖండ' చిత్రంతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కిన ఆయన.. ఈ ఉత్సాహంతోనే ఈ ఏడాది సంక్రాంతికి 'వీర సింహా రెడ్డి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీనికి కూడా అన్ని వర్గాల ఆడియెన్స్ నుంచి భారీ రెస్పాన్స్ లభించింది. ఫలితంగా ఈ సినిమా ఆయన కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లను వసూలు చేసి భారీ హిట్ అయింది.
నటసింహా నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 108వ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్నారు. 'వీర సింహా రెడ్డి' సినిమా వచ్చిన తర్వాత ఈ మూవీ షూటింగ్‌ను మొదలెట్టి ఫస్ట్ షెడ్యూల్‌ను కూడా విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. అలాగే, జనవరి చివరి వారం నుంచే కొత్త షెడ్యూల్ అనుకున్నా.. తారకరత్న మరణం కారణంగా బాలయ్య షూటింగ్‌లో పాల్గొనలేనని చెప్పారు. దీంతో దీనికి కాస్త విరామం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక, ఇప్పుడు ఈ మూవీ షూట్ శరవేగంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే న్యూస్ వైరల్ అవుతోంది.

నందమూరి బాలకృష్ణ కెరీర్‌లోనే వైవిధ్యమైన కథతో రాబోతున్న ఈ చిత్రంలో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ఇందులో ఆమె పాత్ర గురించి ఓ ఆసక్తికరమైన న్యూస్ బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో కాజల్.. బాలయ్య భార్యగా నటిస్తుందట. ఆమె ఎపిసోడ్ మొత్తం సెకెండాఫ్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్‌లోనే చూపిస్తారని తెలిసింది. అంతేకాదు, ఈ మూవీలో కాజల్ పాత్ర విషాదకరంగా ముగుస్తుందని, ఆ సీన్స్ అందరికీ కన్నీళ్లు తెప్పించే విధంగా ఉంటాయని సమాచారం.
నటసింహా బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా.. యంగ్ సెన్సేషన్ శ్రీలీల కూతురిగా నటిస్తోన్నారు. ఇక, ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











