అల్లు అర్జున్‌తో కాజల్ అగర్వాల్.. మామూలు వ్యవహారం కాదట!

Recommended Video

Kajal Aggarwal Item Song In Trivikram-Allu Arjun Movie || Filmibeat Telugu

వయసు పైబడుతున్నా కొద్దీ కాజల్ అగర్వాల్‌లో కొత్త జోష్ వస్తోంది. పదిహేనేళ్ళుగా చందమామ లాంటి అందంతో సౌత్ సినిమా ఇండస్ట్రీని ఏలుతూ వస్తున్న ఈ భామ.. ఈ మధ్యకాలంలో మరింత హాట్‌గా తయారైంది. ఇప్పటికే టాలెంటెడ్ హీరోయిన్‌గా ప్రూవ్ చేసుకున్న ఈమె.. ప్రస్తుతం తనలోని రొమాంటిక్ కోణాన్ని, డిఫెరెంట్ లక్షణాలను ప్రేక్షకుల ముందుకు తెస్తోంది. కేవలం హీరోయిన్ గానే కాకుండా ఎలాంటి అవకాశం వచ్చినా దుమ్ము రేపుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా అల్లు అర్జున్ కొత్త సినిమాలో ఐటెం సాంగ్ చేసేందుకు సిద్దమైందట కాజల్ అగర్వాల్.

త్రివిక్రమ్ స్పెషల్.. ఐటెం సాంగ్

త్రివిక్రమ్ స్పెషల్.. ఐటెం సాంగ్

ప్రస్తుతం అల్లు అర్జున్‌, త్రివిక్రమ్ క్రేజీ కాంబోలో కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇద్దరికీ ఈ సినిమా చాలా ఇంపార్టెంట్ కావడంతో ప్రత్యేక శ్రద్ద తీసుకొని ఈ సినిమాను రూపొందిస్తున్నారు. యువతకు కావాల్సిన అన్ని అంశాలు మేళవించి స్క్రిప్ట్ రెడీ చేశారు త్రివిక్రమ్. ఇందులో తనదైన స్టైల్ ఐటెం సాంగ్ కూడా ప్లాన్ చేశారు. అయితే ఈ ఐటెం సాంగ్ కోసం కాజల్ అగర్వాల్‌ని ఎంపిక చేశారని సమాచారం.

అల్లు అర్జున్‌‌తో పోటీపడి మరీ

అల్లు అర్జున్‌‌తో పోటీపడి మరీ

మాస్ ఆడియన్స్, బన్నీ ఫ్యాన్స్ మెచ్చేలా ఈ సాంగ్ రూపొందించాలని సన్నాహాలు జరుగుతున్నాయట. ఈ సాంగ్ లో అల్లు అర్జున్‌తో పోటీపడి మరీ స్టెప్పులేయనుందట కాజల్ అగర్వాల్. త్రివిక్రమ్ ఐటెం సాంగ్ అంటేనే ఓ ప్రత్యేకత ఉంటుందని మనకు తెలుసు. పైగా దానిపై అల్లు అర్జున్, కాజల్ చిందులంటే ఇక ఏ రేంజ్‌లో ఉంటుందో మనమే ఊహించుకోవచ్చు.

గతంలో ఎన్టీఆర్.. ఇప్పుడు బన్నీ

గతంలో ఎన్టీఆర్.. ఇప్పుడు బన్నీ

టాలీవుడ్ హీరోల్లో డాన్సులకు పెట్టింది పేరు ఎన్టీఆర్, అల్లు అర్జున్. నేటితరం హీరోల్లో ఈ ఇద్దరూ వేసిన స్టెప్పులు ఏ హీరో కూడా వేయలేడు అనడంలో అతిశయోక్తి లేదు. అంతటి టాలెంటెడ్ యంగ్ హీరోలతో కాజల్ వరుసగా ఐటెం సాంగ్స్‌లో చిందులేయనుండటం గమనార్హం. ఇప్పటికే ఎన్టీఆర్ హీరోగా వచ్చిన 'జనతా గ్యారేజ్' చిత్రంలో ఆయనతో కలిసి తాను ''పక్కా లోకల్'' అనిపించుకుంది కాజల్. ఇక బన్నీతో ఏమని పిలిపించుకుంటుందో చూడాలి మరి.

ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ షూటింగ్

ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ షూటింగ్

బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకొని రెండో షెడ్యూల్ షూటింగ్ మొదలు పెట్టుకుంది. గీతా ఆర్ట్స్‌, హారిక హాసిని క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్. అలాగే రెండో హీరోయిన్‌గా నివేదా పేతురేజ్ ఎంపికైంది. సీనియర్ హీరోయిన్ టబు, మరో యంగ్ హీరో సుశాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X