హీరోయిన్ కాజల్ లవర్ ఇతడేనా? (నెట్లో ఫోటోల హల్‌చల్)
హైదరాబాద్: హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈ మధ్య చాలా చాలా సంతోషంగా కనిపిస్తోందని, ఆమె పేసులో గతంలో కంటే ఎక్కువ గ్లో కనిపిస్తోందని.....అందుకు కారణం ఇటీవల జరిగిన ఆమె సిస్టర్ నిషా అగర్వాల్ పెళ్లి సంతోషమో, లేక సినిమా అవకాశాలో కాదని, ప్రేమ వ్యవహారమే అందుకు కారణమనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇపుడు కాజల్ గురించి ప్రేమ వార్తలు ఇపుడు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. ఆమె ముంబైకి చెందిన ఓ వ్యాపారితో ప్రేమ వ్యవహారం నడిపిస్తోందని, సదరు వ్యక్తి ఇంటీరియర్స్ డిజైనింగులో టాప్ పొజిషన్లో ఉన్న ఓ కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఉన్నాడని తెలుస్తోంది.
సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న సదరు ఫోటోలపై ఓ లుక్కేద్దాం....

దుబాయ్‌లో వాలంటైన్స్ డే...
ఇటీవల జరిగిన వాలంటైన్స్ డే సందర్భంగా కాజల్ అగర్వాల్ తన ప్రియుడితో కలిసి దుబాయ్‌లో గడిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మూడేళ్ల వరకు నో పళ్లి అని చెప్పింది కానీ..
ఇటీవల కాజల్ అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ...తాను సినిమల్లో బిజీగా ఉన్నానని, మరో మూడేళ్ల వరకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్పింది. కానీ ఇంతలోనే ఈ ప్రమే వ్యవహారం బయటకు రావడం గమనార్హం.

ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూసే...
కాజల్ గ్లామర్‌కు ఫిదా అయిన అభిమానులు ఎందరో. మరి అలాంటి అందాల దేవత పెళ్లి చేసుకుని తెరకు దూరం అవుతుండటం అంటే అభిమానులకు బ్యాడ్ న్యూసే...

కాజల్ అగర్వాల్ సినిమాలు
ప్రస్తుతం కాజల్ అగర్వాల్ రెండు చిత్రాల్లో నటిస్తోంది. అందులో ఒకటి కృష్ణ వంశీ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతోంది. మరొక చిత్రం బాలాజీ మోషన్ పిక్చర్స్ పతాకంపై తెరకెక్కుతోంది.


Click it and Unblock the Notifications











