Don't Miss!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- News పిఠాపురంకు చిరంజీవి, మెగా హీరోలు - ముహూర్తం ఫిక్స్..!!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కియారా లాగే కాజల్ కూడా.. ఇకపై అలాంటి వాటిలో!
టాలీవుడ్ చందమామ కాజల్ కొద్ది రోజులుగా సరైన హిట్ పడక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. తేజ దర్శకత్వంలో రానా హీరోగా వచ్చిన 'నేనే రాజు నేనే మంత్రి' తర్వాత ఆమెకు ఒక్కటంటే ఒక్క హిట్ కూడా లేదు. ఇటీవల ఆమె చేసిన ప్రతి సినిమా ఫెయిల్ అయింది. అంతేకాదు, కొన్ని సినిమాలు వదులుకోవడం.. కొన్ని సినిమాలు ప్రారంభం కాకపోవడం వంటి కారణాలతో కాజల్ కష్టాలను ఎదుర్కొంటోంది. దీంతో ఈ టాలీవుడ్ బ్యూటీ సరికొత్తగా ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆమె కీలక నిర్ణయం తీసుకుందని టాక్.
ప్రస్తుతం డిజిటల్ మీడియా యుగం నడుస్తోంది. సినిమాలు, సీరియళ్లకు పోటీగా పలు సంస్థలు వెబ్ సిరీస్‌లు తెరకెక్కిస్తున్నాయి. వాటిలో సస్పెన్స్ థ్రిల్లర్స్, అడల్ట్ కంటెంట్ ఉన్న వాటికి మంచి స్పందన వస్తోంది. అందుకే గతంలో కియారా అద్వాణీ చేసిన 'లస్ట్ స్టోరీస్', ఆశా షైనీ చేసిన 'గంధీ బాత్' సహా ఎన్నో వెబ్ సిరీస్‌లు సూపర్ సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు ఇవే సిరీస్‌లను కొత్తగా చూపించడానికి ఫిల్మ్ మేకర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ దశలోనే ఎన్నో సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు.
ముఖ్యంగా తమ వెబ్ సిరీస్‌లకు కలరింగ్ ఉంచుకోవాలని భావిస్తున్న ఫిల్మ్ మేకర్లు పెద్ద పెద్ద నటులను తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడిప్పుడే తెలుగులో పరిచయం అవుతున్న వెబ్ సిరీస్‌లలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇందులో భాగంగానే టాలీవుడ్ చందమామ కాజల్ ఓ వెబ్ సిరీస్‌లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. ప్రముఖ డిజిటల్ మీడియా దిగ్గజం హాట్ స్టార్ నిర్మిస్తున్న ఈ సిరీస్‌ను వెంకట్ ప్రభు తెరకెక్కించబోతున్నాడని సమాచారం. ఇందులో పది భాగాలు ఉంటాయని తెలిసింది. అన్నింటినీ ఒకేసారి షూటింగ్ జరిపి, విడివిడిగా విడుదల చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది.
మరోవైపు, కాజల్ ప్రస్తుతం నటిస్తున్న 'క్వీన్' తమిళ రీమేక్ ఆగిపోయే పరిస్థితి ఉంది. ఆ చిత్ర దర్శకుడు నీలకంఠన్ సినిమా నుంచి అర్థాంతరంగా తప్పుకున్నారని ఆ మధ్య ప్రచారం జరిగింది. అలాగే, కమల్ హాసన్ - శంకర్ కాంబినేషన్లో వస్తున్న 'భారతీయుడు 2' నుంచి కూడా ఆమెను తొలగించారని తాజాగా ఓ వార్త బయటకు వచ్చిన విషయం తెలిసిందే.