జాన్వీ కపూర్ ను వెంటాడుతున్న కాజల్ సెంటిమెంట్?
సౌత్ ఇండియా సినిమాని ఒక ఊపు ఊపిన స్టార్ హీరోయిన్స్ లో హాట్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా ఒకామె అని చెప్పాలి. ఇండస్ట్రీలోకి అందరి హీరోయిన్స్ లానే చిన్న సినిమాల అవకాశాలతోనే వచ్చిన కాజు.. అంచలంచెలుగా ఎదిగి స్టార్ హీరోయిన్ గా మారింది. కాగా తన కెరీర్ లో అతి పెద్ద బ్రేక్ "మగధీర" తర్వాత ఐతే కాజల్ మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు.
అక్కడ నుంచి టాలీవుడ్ లోనే కాకుండా సౌత్ లో కూడా టాప్ 5 హీరోయిన్స్ లో ఒకామెగా కాజల్ నిలిచిపోయింది. కాగా ఆమె ఇండస్ట్రీ లోకి వచ్చి రెండు దశాబ్దాల మేర అవుతున్నా మంచి ఆఫర్స్ ని ఇంకా కాజల్ చేతిలో పెట్టుకుంది. అయితే ఎంత స్టార్ హీరోయిన్ అయినా మరీ ఎక్కువ అవకాశాలు పోటీ వాతావరణంతో తగ్గుతూ ఉంటాయి అలా ఇపుడు చేస్తున్న కొన్ని సినిమాల్లో కూడా కాజల్ ఇటీవల ఆ సినిమాల్లో స్క్రీన్ స్పేస్ ని దక్కించుకోలేలపోయింది.

మెగాస్టార్ చిరంజీవి "ఆచార్య" లో సన్నివేశాలు చేసినప్పటికీ వాటిని తీసేసారు. ఇక తమిళ మరో సీనియర్ స్టార్ హీరో ఉలగనయగన్ కమల్ హాసన్ తో ఇండియన్ సిరీస్ లో చేస్తే అది కూడా పార్ట్ 2 నుంచి పార్ట్ 3 కి మారిపోయింది. కాగా ఇప్పుడు సరిగా ఇదే సెంటిమెంట్ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కి కూడా అప్లై అవుతున్నట్టుగా అనిపిస్తుంది.
అలనాటి అందాల నటి శ్రీదేవి కూతురుగా బాలీవుడ్ లో ఆల్రెడీ పాగా వేసిన ఈ జూనియర్ శ్రీదేవి సౌత్ ఇండస్ట్రీకి జూ. ఎన్టీఆర్ తో చేస్తున్న భారీ సినిమా "దేవర" తో ఎంట్రీ ఇస్తుంది. కానీ ఇక్కడ అనూహ్యంగా కాజల్ కి ఇండియన్ 3 జరిగినట్టే జరుగుతుందని చెప్పాలి. మొదటిగా ఒక సినిమాకి అనుకుని సీన్స్ తెరకెక్కిస్తే అది కాస్తా రెండో భాగానికి షిఫ్ట్ అయ్యినట్టుగా ఆ సినిమాలో కాజల్ కి ఇప్పుడు దేవర విషయంలో జాన్వీకి రిపీట్ అయ్యిందని చెప్పాలి.

కాకపోతే జాన్వీకి కనీసం ఒక సాంగ్ అయినా దేవర లో ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ఇద్దరు హీరోయిన్స్ పాత్రలు మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్ గా భారతీయుడు 3, దేవర పార్ట్ 2 లలో మాత్రమే ఉండనున్నాయని స్వయంగా వారే కన్ఫర్మ్ చేశారు. మరి ఆల్రెడీ భారతీయుడు 2 అంతంత మాత్రమే ఆడింది.
సో భారతీయుడు 3 పరిస్థితి ఏంటో అర్ధం కాని పరిస్థితి ఇలాగే ఇప్పుడు దేవర ఫలితం కూడా అటు ఇటు అయితే పార్ట్ 2 లో జాన్వీ కపూర్ పూర్తిగా ఉన్నా కూడా వేస్ట్ అయిపోతుంది. సో ఈ రకంగా కూడా కాజల్ సెంటిమెంట్ నే జాన్వీ కపూర్ కి కూడా వెంటాడుతుంది అని చెప్పాలి. కాగా భారతీయుడు సిరీస్ ని శంకర్ తెరకెక్కిస్తుండగా దేవర సిరీస్ ని కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. భారతీయుడు 3 వచ్చే ఏడాది వస్తే వస్తుంది. దేవర ఈ ఏడాది సెప్టెంబర్ 27న విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











