పెళ్లి పనుల తరువాతే ఆ సినిమా షూటింగ్స్.. కాజల్ స్ట్రాంగ్ డిసిషన్
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ మొత్తానికి తన సీక్రెట్ లవ్ గురించి బయటపెట్టి ఏకంగా పెళ్లికి సిద్దమైన విషయం తెలిసిందే. రూమర్స్ పెద్దగా వైరల్ అవ్వకుండా పర్సనల్ లైఫ్ ని చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు కాబోయే వాడితో కలిసి పెళ్లికి సంబంధించిన ప్లాన్స్ పై చర్చలు జరుపుతోంది. సింపుల్ గా ఇంట్లోనే చేసుకోవాలని అనుకుంటున్నట్లు ఒక న్యూస్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.
ఇంట్లో ఎంత సింపుల్ గా చేసుకున్నా ముందు జరిగే కార్యక్రమాలు చాలానే ఉంటాయి కాబట్టి నెల ముందు నుంచే కాజల్ బిజీబిజీగా ఫ్యామిలీతో గడపనుందట. ముఖ్యంగా షాపింగ్ తో పాటు పెళ్లికి దగ్గరి బంధువుల కోసం స్పెషల్ రూమ్ లను ఏర్పాటు చేయిస్తోందట. ఇక కాజల్ కమిట్మెంట్ ప్రకారం త్వరలోనే షూటింగ్స్ లలో పాల్గొనాల్సి ఉంది. ముందుగా ఆచార్య సినిమ షూటింగ్ తో బిజీ కానున్న కాజల్ వీలైనంత వరకు పెళ్లికి సంబంధించిన పనులను పూర్తి చేసుకోవాలని అనుకుంటోంది.

అక్టోబర్ 30న కాజల్ తన బాయ్ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకోబోతున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అంటే ఇంకా 15రోజుల సమయం కూడా లేదు కాబట్టి ముందుజాగ్రత్తగా ప్లాన్ తో రెడీగా ఉండాలని అనుకుంటోంది. కుదరకపోతే పెళ్లి తరువాతే షూటింగ్స్ పెట్టుకోవాలని అవసరమైతే క్యాన్సిల్ చేసుకోవాలని కూడా ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. టెన్షన్ లో పెళ్లి చేసుకోవడం కాజల్ కి ఏ మాత్రం ఇష్టం లేదట. అందుకే సినిమా షూటింగ్స్ పెళ్లి తరువాతే అనే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పెళ్లి తరువాత ఆమె హనీమూన్ ప్లాన్ కూడా రెడీ అయినట్లు టాక్.


Click it and Unblock the Notifications











