త్రిష స్థానంలో ఆ హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసిన అందాల భామ.. మరోసారి చిరుతో రొమాన్స్
ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. మొన్నటి వరకు చిరంజీవి-కొరటాల శివ సినిమాలో త్రిష ఆడి పాడనుందని అందరూ అనుకుంటూ ఉండగా.. నిన్నటి ఆ వార్తలకు పుల్ స్టాప్ పడింది.తాను ఆ చిత్రం నుంచి తప్పుకున్నానని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అయితే త్రిష తప్పుకోవడంతో ఆ పాత్ర ఎవరు చేయబోతోన్నారా? ఎవరికి ఆ ఛాన్స్ దక్కుతుందా? అని అందరూ అనుకుంటూ ఉండగా ఓ కొత్త పేరు తెరపైకి వచ్చింది. మరి ఆ విశేషాలేంటో ఓసారి చూద్దాం.

చిరు-కొరటాల ప్రాజెక్ట్..
భరత్ అనే నేను చిత్రం తరువాత కొరటాల శివ చిరు కోసం చాలా రోజుల పాటు ఎదురుచూశాడు. సైరా ప్రాజెక్ట్ ఆలస్యమవుతూ ఉండటంతో కొరటాల సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు సినిమా మొదలై చకచకా షూటింగ్ కూడా మొదలైంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అధికారిక ప్రకటనలు రాకముందే అన్నీ లీకవుతూ వస్తున్నాయి.

ఆచార్య అంటూ నోరుజారిన చిరు..
చిరు కొరటాల ప్రాజెక్ట్ టైటిల్ అంటూ గతకొన్ని రోజులుగా చక్కర్లు కొడుతూనే వస్తోంది. అయితే తాజాగా ఓ పిట్ట కథ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో స్వయంగా చిరంజీవే నోరు జారడంతో ఆచార్య అంటూ అధికారికంగా ప్రకటించినట్టైంది. అయితే ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ అంటూ ఎక్కడా కూడా అఫీషియల్‌గా ప్రకటించలేదు.

తప్పుకున్న త్రిష..
చిరు పక్కన త్రిష అని వార్తలు రావడమే తప్పా.. ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ నుంచి తాను తప్పుకుంటున్నట్లు తెలిపింది. ముందు అనుకున్నది వేరు, చర్చించుకున్నది వేరు.. అన్నీ అనుకున్నట్లు జరగవంటూ చిరంజీవి సర్ ప్రాజెక్ట్ నుంచి తాను బయటకు వచ్చేసినట్టు పేర్కొంది.
Recommended Video


అందాల భామకు ఆ ఛాన్స్..
త్రిష వదులుకున్న ఆ ఛాన్స్ కాజల్ అగర్వాల్‌కు దక్కినట్టు తెలుస్తోంది. ఇప్పటికే చిరుతో ఖైదీ నెంబర్ 150 రొమాన్స్ చేసి మెప్పించింది. మరోసారి కాజల్ అగర్వాల్‌తో చిరు జంట కట్టేందుకు రంగం సిద్దమైనట్టు తెలుస్తోంది. మరి వీటిపై అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











