Don't Miss!
- News ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రావణుడి సోదరి సూర్పణఖగా మారబోతున్న కాజల్.. భారీ బడ్జెట్ చిత్రం!
అందాల చందమామ కాజల్ అగర్వాల్ మనసు విభిన్న చిత్రాలవైపు మళ్లినట్లు తెలుస్తోంది. కాజల్ తన కెరీర్ లో చాలా మంది స్టార్ హీరోల సరసన నటించింది. సౌత్ లో చాలా కాలం స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలపై దృష్టి పెడుతోంది. కాజల్ తదుపతి చిత్రం గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.
హిందూ పురాణం గాధ రామాయణంలో రావణుడి సోదరి సూర్పణఖ పాత్ర ఆధారంగా దర్శకుడు భార్గవ్ భారీ చిత్రానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ ని సూర్పనఖ పాత్రలో నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. సూర్పణఖ అనగానే రాక్షసుడు అయిన రావణుడి సోదరిగానే ఊహించుకుంటాం.
ఈ చిత్రంలో సూర్పణఖని అందాల యువరాణిగా కూడా చూపించబోతున్నారు. మగధీర చిత్రంలో ఇలాంటి పాత్ర కాజల్ అగర్వాల్ ఇప్పటికే పోషించింది. దీనితో ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ అయితే బావుంటుందని ఆమెని సంప్రదించినట్లు తెలుస్తోంది. కాజల్ ఈ ప్రాజెక్ట్ కు సూచన ప్రాయంగా ఓకె చెప్పిందని, అధికారికంగా ఇంకా అంగీకరించలేదని సమాచారం. త్వరలో ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.