చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ సరసన హీరోయిన్‌గా అవకాశం సంపాదించడం ద్వారా తారాపధానికి చేరుకున్న అందాలతార కాజల్ అగర్వాల్ మాదాపూర్ వద్ద ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు సమాచారం. దీని ఖరీదు దాదాపు కోటి రూపాయలు ఉంటుందని తెలిసింది. తేజ రూపొంధించిన 'లక్ష్మీకల్యాణం చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన కాజల్ 'చందమామ','పౌరుడు', 'ఆటాడిస్తా' సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందంతో పాటు అభినయ సామర్ధ్యం కూడా ఉండటంతో క్రేజీ ప్రాజక్టులలో ఆమెకు అవకశాలు వస్తున్నాయి. అందులో భాగంగానే ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రంలో రామ్ చరణ్‌తో నటించే అవకాశాన్ని పొంధింది. అయితే నాలుగే నాలుగు సినిమాలతో ఏకంగా కోటి రూపాయల ఫ్లాటును కొనుగోలు చేయడం టాలీవుడ్‌లో చర్చనీయాంశం అయ్యింది.