మరోసారి కాజల్ తో జత కట్టనున్న రామ్ చరణ్ తేజ్
విజయవంతమైన మగధీర జంట మ్యాజిక్ మళ్ళీ రిపీట్ కానుంది. ధరణి దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్ నటించే నాలుగవ చిత్రంలో కాజల్ ని హీరోయిన్ గా ఎంపికచేసినట్లు సమాచారం. ఈ మేరకు ఆమెతో దర్శకుడు చర్చలు జరిపి, ఆమెకు క్యారెక్టరైజేషన్ చెప్పి ఒప్పించాడని తెలుస్తోంది. ఇక రామ్ చరణ్ తో జోడి అనగానే కాజల్ అస్సలు కథ కూడా వినాల్సిన అవసరం లేదందని తెలుస్తోంది. ఇక మే నెల మొదటి వారంలో ఈచిత్రానికి సంభందించి లాంఛనంగా ముహూర్తం జరుగుతుందని చెప్తున్నారు. ఈ చిత్రం కోసం చెన్నై లో అప్పుడే యాభై లక్షల రూపాయలు విలువ చేసే సెట్ వేసినట్లు చెప్పుకుంటున్నారు.అలాగే ప్రస్తుతం రామ్ చరణ్..బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆరెంజ్..ఓ రేంజ్ లవ్ స్టోరీ అనే చిత్రంలో చేస్తున్నారు. కాజల్...బృందావనంలో ఎన్టీఆర్ సరసన చేస్తోంది. దర్శకుడు ధరణి ఇంతకుముందు పవన్ కళ్యాణ్ తో బంగారం చిత్రం రూపొందించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











