ఆ హీరోతో ప్రేమా? అదొట్టి రూమర్: కాజల్
కాజల్, నవదీప్ ల మధ్య గత కొంత కాలంగా లవ్ ఎఫైర్ నడుస్తున్నాయంటూ వస్తున్న వార్తలను కాజల్ తాజాగా ఖండించింది. తను నవదీప్ ఇద్దరం చందమామ, ఆర్య-2, ఓం శాంతిలలో కలిసి నటించటం కేవలం యాక్సిడెంటల్ అని కొట్టిపారేసింది. మూడు సినిమాల్లో నటించినా మామద్య అంత పేర్లతో పిలుచుకునేంత చనువు కూడా ఏర్పడలేదంటే నమ్ముతారా..అయినా మీరు మేం మూడు సినిమాలు కలిపి చేసామంటున్నారే కానీ అందులో పాత్రలు గుర్తించటం లేదు అంటోంది. ఆర్య-2 చిత్రంలో తాను అల్లు అర్జున్ లవర్ ని అని, అలాగే ఓం శాంతి చిత్రంలో నవదీప్ లవర్ అదితి శర్మ అని గుర్తు చేస్తోంది. మా మద్య ప్రొపిషనల్ రిలేషన్ షిప్ తప్ప మరేపి లేదు. అనవసరంగా మా మధ్య ఏదో ఉందని ఊహించుకుని మీరు బుర్రలు పాడుచేసుకోవద్దు అంటూ సలహాలిస్తోంది. అయితే ఆ టాపిక్ రైజ్ అయ్యినప్పుడు సిగ్గుతో ఆమె ముఖం ఎందుకు ఎర్రపడింది అని ఎదురు క్వచ్చిన్ వేస్తున్నారు ఆ సీన్ లో పార్టిసిపేట్ చేసినవారు. అయితే లవ్ టాపిక్ వస్తే ఎవరికైనా సహజమైన సిగ్గు వస్తుందని మరికొంత మంధి సర్ది చెప్తున్నారు. అదీ నవదీప్, కాజల్ లవ్ ఎఫైర్ యవ్వారం.


Click it and Unblock the Notifications











