ఆ హీరో చిత్రంలో కాజల్ గెస్ట్ రోల్ చేయటానికి కమిటైంది
మగధీర తర్వాత తిరుగులేని హీరోయిన్ గా ఎదిగిన కాజల్ ఇప్పుడు తమ సినిమాలో లక్కీ స్టార్ గా మారింది. తమ సినిమాలో అలా వచ్చి కనపడినా చాలు అనే నిర్ణయానకి వచ్చి ఆమెను సంప్రదిస్తున్నారు దర్శక, నిర్మాతలు. తాజాగా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న మొగుడు చిత్రంలో ఆమెను గెస్ట్ రోల్ కి ఒప్పించినట్లు సమాచారం. మొదట ఈ చిత్రంలో ఆమెను హీరోయిన్ గా అడిగారు.కానీ ఆమె బిజీగా ఉండటంతో ఆమె ఒప్పుకోలేదు. దాంతో ఆమెను కనీసం గెస్ట్ గా అయినా చేయమని రిక్వెస్ట్ చేసి ఒప్పించినట్లు చెప్పుకుంటున్నారు. ఇక ఇంతకుముందు కాజల్...కృష్ణ వంశీ దర్శకత్వంలో చందమామ సినిమాలో నవదీప్ సరసన చేసింది. ఇక మొగడు చిత్రంలో గోపీచంద్ హీరో కాగా తాప్సీ హీరోయిన్ గా చేస్తోంది. సాక్షి గులాటి(అప్పలరాజు ఫేం) మరో హీరోయిన్ గా చేస్తోంది. నల్లమలపు బుజ్జి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ మొదలైంది. రీసెంట్ గా నల్లమలుపు బుజ్జి..నేను నా రాక్షసి చిత్రాన్ని పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందించారు. ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ వచ్చింది.


Click it and Unblock the Notifications











