బద్రినాథ్ ఫేక్ నెంబర్స్ కంటే ఫ్లాప్ అని తేల్చేస్తే బాగుంటుంది...!?
ఇప్పుడు బద్రినాథ్ కి వేసుకుంటున్నట్టే అప్పట్లో ఆర్య2కి కూడా ఫేక్ కలెక్షన్స్ వేసుకుని సంబరపడిపోయారు. అయితే ఆ సినిమాని ప్లాప్ అని మీడియా డిక్లేర్ చేసిందనుకోండి, అది వేరే సంగతి. అయితే అల్లు అర్జున్ గ్రూప్ మాత్రం ఇప్పటికీ ఆర్య 2 ప్లాప్ అంటే ఒప్పుకోరు అది కొన్ని వర్గాల ప్రేక్షకులకి బాగా నచ్చేసి కొన్ని వారాల పాటు సూపర్ గా ఆడేసిందని అంటారు అయితే అందులో కథానాయికగా నటించిన కాజల్ కి అది హిట్టో ప్లాపో బాగా తెలుసు..
అందుకే తన హిట్ సినిమా, ప్లాప్ సినిమాల మధ్య పోలిక తేవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మగధీర, ఆర్య2సినిమాల్ని ఉదాహరణగా చెప్పి ఈ రెండు సినిమాల్లోని పాత్రలు తనకు నచ్చాయని, రెండికి ఒకే రీతిన కష్టపడ్డానని, అయితే ఒకటి ఆడిందని, మరొకటి పోయిందని కాజల్ తేల్చేసింది. సో..అల్లు అర్జున్ బ్యాచ్ ఇక ఆర్య 2ని అఫిషియల్ గా బన్నీ ప్లాప్స్ లోకి నెట్టేస్తే బెటర్..అలాగే బద్రినాథ్ కూడా కాస్ట్ ఫెయిల్యూర్ అనే సంగతి దృవీకరించే పని తమన్నాకి విడిచి పెట్టకుండా ప్లాప్ అని ఒప్పేసుకుంటే గౌరవంగా ఉంటుంది.


Click it and Unblock the Notifications











