మహేష్ లో ఆ లక్షణానికి భయపడే కాజల్ 'నో' చెప్పాలనుకుంటోందా?
మహేష్, పూరిల కాంబినేషన్‌లో రూపొందనున్న 'ది బిజినెస్ మేన్" చిత్రంలో కాజల్ హీరోయిన్ గా ఎంపికచేయనున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసింది. అయితే కాజల్ మాత్రం ఈ విషయమై పెద్దగా ఆసక్తి చూపటం లేదని, మహేష్ బాబు సినిమా అంటే భయపడుతోందని చెప్తున్నారు. పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్ళుతున్న తనకు మహేష్ తో చేస్తే చాలా టైమ్ కిల్ అవుతుందనిని ఆమె ఆలోచనలో పడుతోంది. అందుకు తగినట్లే మహేష్ రీసెంట్ సినిమా ఖలేజా, దూకుడు రెండూ కూడా చాలా షూటింగ్ లలో జాప్యం ఎదుర్కొంటున్నాయి. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మించనున్న ఈ చిత్రం జూలై నుంచి సెట్స్‌మీదకు వెళ్ళనుంది.. 'గన్స్ డోన్ట్ నీడ్ అగ్రిమెంట్సు" అనే ఉపశీర్షికతో తెరకెక్కనున్న ఈ సినిమా... మాఫియా నేపథ్యంలో కొనసాగుతుంది. తొలిసారిగా మహేష్‌తో నటించే అవకాశం రావటం పట్ల ఎంతో హ్యాపీగా వుందని తెలుస్తోంది. మిస్టర్ ఫర్ ఫెక్ట్ హిట్ తో ఉత్సాహంగా ఉన్నామెకు ఇది శుభవార్తేనని అంటున్నారు. ప్రస్తుతం నాగచైతన్యతో ఓ చిత్రంతో పాటు రవితేజ 'వీర" చిత్రంలో నటిస్తోంది. అంతేగాక ఆమె సింగం(యముడు) రీమేక్ తో హిందీలోకి సైతం వెళ్తోంది. అజయ్ దేవగన్ హీరోగా చేస్తున్న ఆ చిత్రంలో కాజల్..అనుష్క చేసిన పాత్రను పోషిస్తోంది. గోల్ మాల్ సీరిస్ డైరక్టర్ రోహిత్ శెట్టి ఆ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











