twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిజినెస్ మేన్ కి కాజల్ నచ్చలేదంట..కారణం..?

    By Sindhu
    |

    తెలుగు సినిమాల్లో గత కొంత కాలంగా తన హవాని కొనసాగిస్తున్న క్రేజీ హీరోయిన్ కాజల్ అగర్వాల్ 'సింగం" రీమేక్‌ తో బాలీవుడ్‌ లోకి ప్రవేశిస్తున్న విషయం తెలిసిందే. రోహిత్ శెట్టి దర్శకత్వంలో అజయ్‌ దేవ్‌ గన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం ఈ నెల 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ చిత్రంతో పాటు కాజల్ పూరీజగన్నాథ్ రూపొందించనున్న 'ది బిజినెస్ మెన్" చిత్రం తెలుగు వెర్షన్‌ లో మహేష్‌ కు జోడీగా, అలాగే హిందీ వెర్షన్‌ లో అభిషేక్‌ బచ్చన్‌ కు జోడీగా ఎంపికైన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే రోహిత్ శెట్టి రూపొందించిన 'సింగం" చిత్రంతో కాజల్ బాలీవుడ్‌ కు పరిచయమవుతుండటంతో కాజల్‌ ని పక్కన పెట్టి కొత్త ముఖాన్ని వెతకమని అభిషేక్‌ బచ్చన్ దర్శకుడు పూరీతో చెప్పాడట.

    దీంతో చేసేది లేక పూరీజగన్నాథ్ 'ది బిజినెస్ మెన్" హిందీ వెర్షన్ నుంచి కాజల్ ని తప్పించాడని బాలీవుడ్‌ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ గుసగుసలపై కాజల్ స్పందించక పోవడం గమనార్హం. ఆర్ఆర్ మూవీమేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మించనున్న ఈ చిత్రం ఈ నెల 26న లాంఛనంగా ప్రారంభమై ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతోంది. అన్నీ కుదిరితే చిత్రాన్ని జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

    English summary
    Magadheera beauty Kajal has been left out from Businessman, Puri jagannath's latest Hindi movie. But she has a good news that she bagged a offer to do in telugu version with mahesh Babu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X