twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ సినిమా నుంచి కాజల్ అవుట్ ?

    By Srikanya
    |

    హైదరాబాద్ : మహేష్,సుకుమార్ కాంబినేషన్ లో ప్రారంభం అయిన చిత్రంలో మొదట కాజల్ ని హీరోయిన్ గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమె ఈ ప్రాజెక్టు నుంచి బయిటకు వచ్చినట్లు సమాచారం. దానికి కారణం డేట్స్ ఎడ్జెస్ట్ చేయలేకపోవటమే అని తెలుస్తోంది. మొదట అనుకున్న షెడ్యూల్ ప్రకారం సినిమా షూటింగ్ జరగకపోవటంతో ఈ నిర్ణయం తీసుకుందని, ఆమె డేట్స్ క్లాష్ అవటమే దీనికి కారణమని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. మరో ప్రక్క సుకుమార్ సైతం మరో హీరోయిన్ కోసం అన్వేషణ జరుపుతున్నట్లు చెప్పుకుంటున్నారు. అక్టోబర్ 10 నుంచి ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ మొదలువుతుంది.

    మహేష్‌తో 'దూకుడు' చిత్రాన్ని నిర్మించిన 14రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. రొమాంటిక్ చిత్రాల దర్శకుడిగా గుర్తింపుపొందిన సుకుమార్ దర్శకత్వంలో మహేష్‌బాబు తొలిసారిగా నటిస్తుండటంతో ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. సుకుమార్ తయారుచేసిన స్క్రిప్ట్ మహేష్‌బాబుని బాగా ఇంప్రెస్ చేసిందని, ముఖ్యంగా ఆయన క్యారెక్టరైజేషన్ పూర్తి వైవిధ్యంగా వుండేలా సబ్జెక్ట్‌ను సుకుమార్ తీర్చిదిద్దాడని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. సినిమా కథ విషయానికొస్తే... గోవా బ్యాక్‌ డ్రాప్‌తో ఈ చిథ్ర కథ నడుస్తుందని తెలిసింది. అంతే కాకుండా ఇందులో మహేష్ బాబు తొలిసారిగా సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించనున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మహేష్ బాబు ఇందులో లెక్చరర్ పాత్ర చేస్తున్నారని అంటున్నారు.

    కాజల్ రీసెంట్ గా మీడియాతో మాట్లాడుతూ....''నా చేతిలో ఎన్ని సినిమాలైనా ఉండొచ్చు. మరెన్ని భాషల్లోనైనా నేను నటిస్తుండొచ్చు. కానీ... ఒప్పుకొన్న ఏ ఒక్క ప్రాజెక్టుకీ ఇబ్బందులు తలెత్తకూడదు. నా కారణంగా ఒక్క రోజు షూటింగ్‌ ఆగిపోయిందన్నా తట్టుకోలేను'' అని చెబుతోంది.

    ప్రస్తుతం కాజల్ తెలుగు, తమిళ చిత్రాలతో క్షణం తీరిక లేకుండా ఉంది. బాలీవుడ్‌లో కొత్త చిత్రాలేమైనా అంగీకరించారా అని కాజల్‌ని ప్రశ్నిస్తే ''స్పెషల్‌ ఛబ్బీస్‌ అనే చిత్రం ఒకటి చేస్తున్నాను. ఇక కొత్తవేవీ అంగీకరించలేదు. ఎందుకంటే నాకు తెలుగు, తమిళ భాషల్లో ఆరు చిత్రాలున్నాయి. వాటన్నిటికీ కాల్షీట్లు ఇచ్చేశాను. ఇక నా డైరీలో ఖాళీ ఎక్కడ ఉంటుంది. వరుసగా ఎక్కువ చిత్రాలు అంగీకరించాను. అయితే ఎక్కడా గందరగోళం లేకుండా ప్రణాళికాబద్ధంగా చిత్రాలు చేస్తున్నాను. కాబట్టే దర్శక నిర్మాతలకు ఇబ్బంది లేకుండా చూసుకొంటున్నాను'' అని తెలిపింది.

    English summary
    It's rumered that Kajal Agarwal is being dropped from the prestigious Mahesh Babu-Sukumar's film. Sources say that the director is looking for a replacement for the female lead after encountering date issues with the actress. Sukumar initially roped in Kajal opposite Mahesh Babu to repeat the 'Businessman' magic but that looks unlikely at the moment. Perhaps, we can get a better picture once the makers announce it formally.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X