రామ్ చరణ్ 'మెరుపు' చిత్రం నుంచి కాజల్ ఔట్
విజయవంతమైన మగధీర జంట రిపీట్ అవుతూ మెరుపు చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు ధరణి డైరక్షన్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో కాజల్ చేయటం లేదని తాజా సమాచారం. దాదాపు 19 రోజులు పాటు ఓ పాట, కొంత షూటింగ్ ఆమెతో చేసిన తర్వాత ఆమె దర్శక, నిర్మాతలను ఒప్పించి తప్పుకున్నట్లు చెప్తున్నారు. షూటింగ్ ఎక్కువ కాలం గ్యాప్ రావటంతో తాను ఒప్పుకున్న మిగతా సినిమాలు పూర్తిచేయాలని, ఆ కమిట్ మెంట్స్ దృష్ట్యా తప్పుకున్నట్లు వివరించిందని తెలుస్తోంది. అయితే ఈ విషయమై రామ్ చరణ్ గరం గరంగా ఉన్నాట్ట. అసలే అంతంత మాత్రంగా ఆడిన ఆరెంజ్ ఫెయిల్యూర్ నుంచి కోలుకుంటున్న సమయంలో ఈ కొత్త తలనొప్పేంటని విసుక్కుంటున్నాట్ట. మరో ప్రక్క దర్శకుడు కాజల్ ప్లేస్ లో ఇలియానాని తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్ ఫుట్ బాల్ ప్లేయర్ గా కనిపిస్తారు. కాజల్...ఎన్టీఆర్ కొత్త చిత్రం కమిటైంది. ఇంతకు ముందు దర్శకుడు ధరణి ఇంతకుముందు పవన్ కళ్యాణ్ తో బంగారం చిత్రం రూపొందించారు.


Click it and Unblock the Notifications











