మహేష్ బాబు సరసన ఛాన్స్ కొట్టేసిన కాజల్
మగధీరలో యువరాణిగా చేసిన దగ్గరనుంచి వరసగా కాజల్ కు పెద్ద స్టార్స్ చిత్రాల్లో అవకాశాలు వస్తున్నాయి. తాజాగా ఆమె మహేష్ బాబు సరసన బుక్కయింది. సెప్టెంబర్ నుంచి మొదలయ్యే ఈ చిత్రాన్ని ప్రముఖ తమిళ దర్శకుడు లింగు స్వామి డైరక్ట్ చేయనున్నాడు. ఇక తమిళ, తెలుగు వెర్షన్ లో ఆమె హీరోయిన్ గా చేయటానికి సైన్ చేసింది. ఇక తమిళంలో హీరోగా మొదట శింబుని అనుకున్నారు కానీ గొడవలు రావటంతో విరమించుకున్నారు. ఇక లింగు స్వామి గతంలో రన్, పందెంకోడి, అవారా వంటి హిట్స్ ఇచ్చి ఉన్నారు. ఆయన దర్శకత్వంలో చేయటానికి చాలా మంది హీరోలు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇక కాజల్ ప్రస్తుతం ఎన్టీఆర్ సరసన బృందావనంలో చేస్తోంది. సమంత మరో హీరోయిన్ గా చేసే ఆ చిత్రాన్ని వంశీ పైడిపల్లి డైరక్ట్ చేస్తున్నారు.
More from Filmibeat
కాజల్ మగధీర రాజమౌళి జూ ఎన్టీఆర్ సమంత బృందావనం మహేష్ బాబు kajal magadheera rajamouli jr ntr mahesh babu brindavanam


Click it and Unblock the Notifications











