బాలకృష్ణకు జోడీగా..ఎన్టీఆర్ హీరోయిన్ ?
ఈ చిత్రం షూటింగ్ ఇప్పటి వరకు 25 శాతం చిత్రీకరణ పూర్తయింది. జగపతిబాబు విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా మెయిన్ హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్‌ను ఎంపిక చేస్తున్నారని చిత్ర వర్గాల సమాచారం. సెకెండ్ హీరోయిన్‌గా సొనాల్ చౌహాన్‌ను ఇప్పటికే ఎంపిక చేశారు. అయితే క్రేజీ హీరోయిన్స్ కాజల్ అగర్వాల్, అనుష్క, తమన్నా, అంజలిలను సంప్రదించిన దర్శకుడు బోయపాటి శ్రీను చివరికి కాజల్ అగర్వాల్‌ను మెయిన్ హీరోయిన్ గా ఖరారు చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
ఈ సినిమా కోసం కాజల్ భారీ మొత్తంలో రెమ్యునేషన్ ని తీసుకోబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం కాజల్ తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌తో 'నన్‌బయెండా', విజయ్‌తో 'జిల్లా', కార్తీతో 'ఆల్ ఇన్ ఆల్ అళగురాజా' చిత్రాల్లో నటిస్తోంది. హీరోయిన్ ప్రాధాన్య పాత్రల్లో నటిస్తూనే..రెగ్యులర్ వాణిజ్య పంథా సినిమాలు చేస్తాను. ప్రయోగాలకూ వెరువను. కమర్షియల్ సినిమాలోనూ నా పాత్రకి ప్రాధాన్యత చూస్తాను. ప్రతి ఎంపికలోనూ ప్రత్యేకత చాటుతా..అంటున్నారు కాజల్.
ఇక సింహా లాంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత మరోసారి బాలకృష్ణ,బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మరో చిత్రం రాబోతోంది. ఈ చిత్రం ఎలా ఉండబోతోందనే అంచనా అభిమానుల్లో ఉండటం సహజం. ఈ నేపధ్యంలో బోయపాటి శ్రీను క్లారిఫికేషన్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ... సింహా తరవాత నందమూరి బాలకృష్ణతో సినిమా చేయబోతున్నా. అంచనాలు ఏ విధంగా ఉంటాయో తెలుసు. 'సింహా'ని మించే సినిమా తీస్తా... అని చెబితే అది తొందరపాటు అవుతుంది. కానీ ఆ స్థాయికి మాత్రం తగ్గదు అన్నారు.
అలాగే బాలకృష్ణ నుంచి ప్రేక్షకులు, అభిమానులూ ఏం కోరుకొంటారో అవన్నీ మేళవిస్తూ.. ఆయన్ని కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నా. రాజకీయ అంశాలూ ఉంటాయా? అని అందరూ అడుగుతున్నారు. అవీ ఉంటాయి. కానీ.. కథకు ఎంత వరకూ అవసరమో అంతే. ఆ గీత దాటి బయటకు వెళ్లవు అన్నారు. చిత్రానికి 'రూలర్' టైటిల్ అని, మోహన్‌లాల్ కీలక పాత్ర చేస్తారని, నయనతార హీరోయిన్ అనీ.. ఇలా ఏవేవో ప్రచారమవుతున్నాయి. వీటిలో ఒక్కటి కూడా నిజం కాదు. అలాగే ఇందులో రాజకీయ అంశాలుంటాయని కూడా భావిస్తున్నారు. నేను కుటుంబ విలువలకు ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తిని కాబట్టి.. ఆ విలువలు కచ్చితంగా ఈ చిత్రంలో ఉంటాయి. భావోద్వేగాలు ఉంటాయి. 'సింహా'లో బాలయ్యలో కనిపించిన వాడి వేడి ఏ మాత్రం తగ్గవు. అందరూ అనుకుంటున్నట్లు రాజకీయాలకు సంబంధించిన అంశాలు ఉంటాయో లేదో చెప్పలేను. ఒకవేళ ఉంటే.. పైన చెప్పిన అంశాలకు ఇవి బోనస్ అవుతాయి. అంతేకానీ అవి లేకుండా పాలిటిక్స్‌కే పరిమితం అయ్యే సినిమా కాదు.


Click it and Unblock the Notifications












