సెల్లింగ్ బ్రాండ్ మహేష్ పైనే పొగరుబోతుచిన్నదాని ఆశలు...!?
ఇన్నాళ్లూ అణిగి మణిగి ఉన్న కాజల్ కి మిస్ట్ర్ ఫర్ ఫెక్ట్ హిట్టయిన తర్వాత కొమ్ములు మొలిచాయి. తనకిక ఎదురు లేదనే నమ్మకం వచ్చేసరికి అసలు బుద్ది బయటపెట్టుకుంది. బాలీవుడ్ కి వెళ్లి దక్షిణాదిని తూలనాడిన కాజల్ ఇప్పుడు తనకి ఎంత పెద్ద హిట్ వచ్చినా అస్సలు లెక్కే లేదన్నంతో రేంజ్ లో ఉన్నది. సింగం లాంటి భారీ విజయంతో ఎలా ఫీలవుతున్నారని అని అడిగితే, ఆనందంగా ఉందని చెప్పడం పోయి 'ఇలాంటి హిట్లు నాకు కొత్త కాదు. తెలుగులో మగధీర లాంటి భారీ హిట్ చిత్రంలో నటించాను. బృందావంన, మిస్టర్ ఫర్ ఫెక్ట్ కూడా పెద్ద హిట్లే. నాకు ఇలాంటివి అలవాటైపోయాయి. అందుకే అంతగా ఎక్సైట్ కాలేదు అని చాలా రాష్ గా సమాదానం చెప్పింది.
ఈ సంవత్సరంలో దడ లాంటి పెద్ద డిజాస్టర్, దానికి ముందు విడుదలైన వీర బిగ్ ఫ్లాప్ తో ఎక్కడో కొంత భయం ఏర్పడుతోంది. రెండు పెద్ద ఫ్లాప్ లతో మునపటి క్రేజ్ కోల్పోతానేమోనన్న భయం కాజల్ కు పట్టుకొన్నదని సమాచారం. అయితే పైకి మాత్రం ఏం పర్వాలేదు...ప్రిన్స్ స్టార్ మహేష్ బాబుతో 'ది బిజినెస్ మ్యాన్" నటిస్తున్నందున మళ్లీ ఫామ్ లోకి వచ్చేయెచ్చు అన్న ధీమా కూడా కాజల్ ఉన్నదని సమాచారం. మహేష్ బాబు, టాలీవుడ్ లో హ్యాండ్సమ్ మరియు మేజర్ సెల్లింగ్ బ్రాండ్ మహేష్ బాబు పై చాలా ఆశలే పెట్టుకొంది. డెడ్లీ కాంబినేషన్ అయిన పూరి-మహేష్ బాబుల కాంబినేషన్ లో కాజల్ నటించడం ఒక వరంగానే భావిస్తోందట. అయితే కాజల్ కోరిక మహేష్ బాబు ఎంత వరకు తీరుస్తాడు బిజినెస్ మ్యాన్ వచ్చేదాకా ఎదురుచూడాల్సిందే...


Click it and Unblock the Notifications











