'రచ్చ'లో ప్రత్యేక పాటలో ఆ హీరోయిన్
రామ్ చరణ్ తాజా చిత్రం రచ్చలో గ్యాంగ్ లీడర్ చిత్రంలోని టైటిల్ సాంగ్ ని రీమిక్స్ చేసి వాడుతున్న సంగతి తెలిసిందే. ఈ పాట కోసం చిరంజీవి గత చిత్రాల్లో వాడిన డ్రస్ లను ఉపయోగించనున్నట్లు సమాచారం. ఇందుకోసం చిరంజీవి హిట్స్ లోని డ్రస్ లను పరిశీలించి ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. అందులో అచ్చం చిరంజీవిగా కనిపించి తన తండ్రి అబిమానులను అలరించాలని రామ్ చరణ్ నిర్ణయించుకున్నట్లు చెప్తున్నారు. అలాగే ఈ పాట కోసం ఓ స్టార్ హీరోయిన్ చేత స్టెప్స్ వేయించాలని చరణ్ భావిస్తున్నట్లు చెప్తున్నారు. ఇక ఆమె కాజల్ అయ్యే అవకాశముందని వార్త. మగధీరలో బంగాలనరు కోడి పెట్ట సాంగ్ లో చిరంజీవి కనిపించి అలరించినట్లుగానే ఈ పాట హైలెట్ కావాలని భావిస్తున్నారు. రామ్ చరణ్ తన తాజా చిత్రం రచ్చ గురించి మాట్లాడుతూ....ఈ చిత్రం టాలీవుడ్ లో ఓ ఉదాహణగా నిలిచిపోతుంది. తక్కువ ప్రొడక్షన్ కాస్ట్ తో ఎంత ఎక్కువ సినిమాటెక్ వ్యాల్యూస్ తో తీయవచ్చు అనే విషయంలో. మేము ఈ సినిమా పూర్తికాగానే ఎంత ఖర్చు అయ్యింది..ఎలా ఖర్చు పెట్టాం అనే విషయాలను తెలియచేస్తాం అన్నారు రామ్ చరణ్.
ఇక రచ్చ దర్శకుడు సంపత్ నంది గురించి చెపుతూ..నేను చాలా ఎగ్జైట్మెంట్ తో ఉన్నాను..అలాంటి పాత్రను నేను ఎప్పుడూ ఊహించుకోలేదు. నా ఫ్యాన్స్ నానుంచి ఎలాంటి సినిమా ఎక్సపెక్ట్ చేస్తారో ఖచ్చితంగా అలాంటిదే ఇది. ఈ స్క్రిప్టుని సంపత్ నంది చాలా జాగ్రత్తగా వర్క్ చేసి తెరకెక్కిస్తున్నారు. అతను చాలా ప్రతిభావంతంగా పనిచేస్తున్నాడు అన్నారు. ఇక రచ్చ చిత్రాన్ని క్రిసమస్ కానుకగా విడుదల చేయాలని రామ్ చరణ్ చెప్తున్నారు. పూర్తిస్థాయి యాక్షన్ చిత్రంగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంకోసం రామ్ చరణ్ మియామి, అమెరికలో మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. తమన్నా రామ్ చరణ్ తో జోడికడుతున్న ఈ సినిమాలో చరణ్ మిడిల్ క్లాస్ కుర్రాడుగా పక్కా మాస్ పాత్రను చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ 'రచ్చ'సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని ప్రతిస్టాత్మకంగా నిర్మిస్తుంది.


Click it and Unblock the Notifications











