థాయ్ ల్యాండ్ లో కాజల్, ఆ హీరో ఎంజాయ్!?
కాజల్, ప్రభాస్ మధ్య లవ్ ఎఫైర్ నడుస్తోందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో కొన్ని ఫోటోలు కాజల్, ప్రభాస్ ఉన్నవి నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. కాజల్ ప్రత్యేకంగా ప్రభాస్ కోసం ధాయ్ ల్యాండ్ వెళ్లిందని అక్కడే న్యూ ఇయిల్ సెలబ్రేషన్స్ జరుపుకుందని ఆ వార్తల సారాంశం. అయితే కాజల్ బ్యాంకాక్ కి రెస్ట్ కోసం వెళ్లిందని,అయితే అక్కడే ప్రభాస్ ఉండటంతో కర్టసి కోసం కలిసి వచ్చిందని,దాన్ని పెద్దది చేసి గాసిప్స్ పుట్టిస్తారని ఆమె తరపు వారు అంటున్నారు. బిజినెస్ మ్యాన్ హిట్ కావటంతో ఉత్సాహంగా ఉన్న కాజల్ ఆ సెలబ్రేషన్స్ కోసం అక్కడికి వెళ్లిందని చెప్పుతున్నారు.
ఇక డార్లింగ్ చిత్రం సమయంలో వీరిద్దరి మధ్యా పరిచయం జరిగింది. మిస్టర్ ఫెరపెక్ట్ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారని, అప్పట్లో పెళ్ళి కూడా చేసుకుంటారని వినిపించింది. ఇక కెరీర్ లో ప్రస్తుతం కాజల్ క్రితం సంవత్సరం ప్లాప్ లు వచ్చినా ఈ సంవత్సరం ప్రారంభంలో బిజినెస్ మ్యాన్ ఆమెలో ఉత్సాహాన్ని నింపింది. ఇక ప్రభాస్ కుటుంబం వారు మాత్రం వీరి ప్రేమను యాక్సెప్ట్ చేయటం లేదని చెప్తున్నారు. ఇక ప్రభాస్ .. బ్యాంకాక్ లో రెబెల్ షూటింగ్ లో ఉన్నారు. లారెన్స్ దర్శకత్వంలో రూపొందుతున్న రెబెల్ చిత్రం ఛత్రపతి రేంజ్ చిత్రం అవుతుందని చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











