కసితో ఇంకోటి చేద్దామంటోన్న‘మగధీర’ హీరోయిన్
'లక్ష్మీకళ్యాణం" తో హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయిన కాజల్ కి 'చందమామ" మంచి బ్రేక్ ఇచ్చింది..'మగధీర" మెగా టర్నింగ్ పాయింట్ అయింది. కాగా ప్రస్తుతం అనధికారక నెంబర్ వన్ హీరోయిన్ హోదాలో స్టార్స్ అందరి సరసనా నటించేస్తూ చాలా బిజీగా వున్న కాజల్ కి ఈ మధ్య కసి బాగా ఎక్కువైందని చెబుతున్నారు ఆమె సినిమాల యూనిట్ మెంబర్స్..కసి అంటే మరేదో కాదో నటిగా తనను తాను ఇంకా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని కసిగా ప్రయత్నిస్తోందని సమాచారం.
ప్రస్తుతం జూ ఎన్టీఆర్ తో 'బృందావనం", రామ్ చరణ్ తేజ్ తో 'మెరుపు", ప్రభాస్ తో ఓ చిత్రంలో, నాగచైతన్య తో మరో చిత్రం చేస్తోన్న కాజల్ ఇక నుంచీ గ్లామర్ డాల్ గానే కాక పెర్ ఫార్మర్ గానూ శెభాస్ అనిపించుకోవాలని సిన్సియర్ గా ట్రై చేస్తోందట..సింగిల్ టేక్ కే సీన్ ఒకే అయినా బెటర్ మెంట్ కోసం ఇంకోటి చేద్దామంటోందట. మొత్తానికి అమ్మడి కసి ఫలితంగా రీళ్ళకి రీళ్ళు కరిగిపోతున్నాయనే కామెంట్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











