చెల్లిని వ్యాపారం లోకి దించే ప్రయత్నంలో కాజల్
ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ అంతా తలో వ్యాపారం చేసుకుంటూ సెటిల్ అయిపోతున్నారు. తాజాగా ఇలియానా స్టార్ట్ చేసిన వ్యాపారం సరికొత్త ట్రెండ్ సృష్టించింది. దాంతో ఇలియానా తో పోటీ పెట్టుకున్న హీరోయిన్లంతా తలా ఒక బిజినెస్ ప్రారంభించే పనిలో పడ్డారు. అందులో భాగంగా కాజల్ కూడా నేనూ వ్యాపారవేత్తనే అంటూ సరికొత్త వ్యాపారానికి తెరతీసింది. మేకప్ కిట్లు, పెర్‌ఫ్యూమ్స్, ఫెయిర్‌గా కనిపించడానికి వాడే అనేక రకాల ఉత్పత్తుల వ్యాపారం ప్రారంభించింది. పనిలోపనిగా తన చెల్లెల్ని కూడా ఈ వ్యాపారంలోకి దించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే చెల్లెలితో ఏ వ్యాపారం చేయిస్తుందో ఇంకా డిసైడ్ చేసుకోలేదు. మరికొన్నాళ్లు చూసి ఏ సినిమా అవకాశాలు రాకపోతే వ్యాపారం పెట్టించే ప్రయత్నంలోనే ఉంది.
ఇక వరుణ్ సందేశ్'ఏమైంది ఈ వేళ"చిత్రంతో పరిచయం అయిన నిషా పెద్దగా ఆఫర్స్ సంపాదించలేకపోయింది. అంతేగాక కాజల్ ని ఏ క్లాత్ షోరూం వారన్నా ఏ ప్రారంభోత్సవ కార్యక్రమానికో పిలిస్తే.. తన చెల్లెల్ని వెంటేసుకుని వస్తోంది. అంతేగాక ఆమెకు సైతం రెమ్యునేషన్ డిమాండ్ చేసి తీసుకుంటోంది. దాంతో కాజల్ కక్కుర్తి వ్యవహానికి ఇండస్ట్రీ బేజారెత్తుతోంది. కాజల్ ప్రస్తుతం ప్రభాస్‌తో 'మిస్టర్ పెర్‌ఫెక్ట్" చిత్రంతోపాటు రవితేజతో 'వీర" నాగచైతన్యతో ఇంకా పేరు పెట్టని చిత్రంలోనూ నటిస్తోంది.


Click it and Unblock the Notifications











