రానా సరసన కాజల్ ని ఎంపిక
రానా తాజాగా క్రిష్ చిత్రం కమిటైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ ని ఎంపిక చేసారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.అయితే ఇంకా ఆమెను ఖరారు చేయలేదని ప్రస్తుతం టాక్స్ జరుగుతున్నాయని చెప్తున్నారు. ఇక ఈ చిత్రానికి కృష్ణం వందే జగద్గురమ్ అనే టైటిల్ ని పెట్టారు.అదే టైటిల్ తో గతంలో వెంకటేష్ హీరోగా క్రిష్ ఓ కథను సిద్దం చేసిన అశ్వనీదత్,సురేష్ బాబు కాంబినేషన్ లో సినిమా చేయటానికి ప్రయత్నించారు. కానీ అది ముందుకు వెళ్లకపోవటంతో వేదం చిత్రం చేసారు. గమ్యం,వేదం చిత్రాలతో క్రిష్ ఓ మేధావి దర్శకుడుగా ప్రశంసలు అందుకున్నారు.తమిళంలో కూడా వేదం రీమేక్ మంచి మార్కులే వేయించుకుంది.ఇప్పుడు చేస్తున్న సబ్జెక్టు కూడా మానవతా విలువలతో కూడి ఓ మాస్ ఎంటర్టైనర్ ని కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారని అనుకుంటున్నారు. ఇక క్రిష్ చిత్రం అంటే ప్రేక్షకుల్లో సైతం నేరేషన్ నుండి అంతా కొత్తగా ఉంటుందని ఎక్సపెక్ట్ చేస్తున్న నేపధ్యంలో ఈ చిత్రంపై మంచి అంచనాలే ఏర్పడటంలో ఆశ్చర్యం లేదు. ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. రానా ప్రస్తుతం నా ఇష్టం,హిందీలో డిపార్టమెంట్ చిత్రాలు చేస్తున్నారు. కాజల్ సైతం ది బిజెనెస్ మ్యాన్ తప్ప కొత్తగా ఏ ప్రాజెక్టులు కమిట్ కాలేదు. మగధీరతో క్రేజ్ తెచ్చుకున్న ఆమె ఆ మద్య వరసగా వచ్చిన ప్లాపులతో డౌన్ అయ్యింది.మహేష్ సినిమాతో మళ్లీ లైమ్ లైట్ లోకి వస్తుందని భావిస్తోంది.


Click it and Unblock the Notifications











