మొత్తానికి కాజల్ కూడా బికినీ వేస్తోంది
కాజల్ ..బికినీలో కనిపించనుంది తెలుసా అనేదే ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇన్నాళ్ళూ హోమ్లీ లుక్ తో కనిపించిన ఈ ముద్దుగుమ్మ హఠాత్తుగా రూట్ మార్చాల్సిన అవసరం ఏమి వచ్చిందీ అంటే...బాలీవుడ్ ఎంట్రీ అని చెప్తున్నారు. అక్కడ పోటీ తట్టుకోవాలంటే కొన్ని చమక్కులు చెయ్యాల్సిందే అని విశ్లేషిస్తున్నారు.ఇంతకీ ఆమె బికినీ వేస్తుంది తెలుగు సినిమాల్లో కాదు - బాలీవుడ్‌లో. తమిళంలో విజయవంతమైన 'సింగం" (తెలుగు యముడు) చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు. దానిలో హీరోయిన్‌గా కాజల్ నటిస్తోంది.
పనిలో పనిగా బాలీవుడ్ అవకాశాలను మరికొన్ని వొడిసిపట్టాలనే కోరికతో తొలి చిత్రంలోనే బికినీకి 'సై" అంటూ అక్కడ స్టేట్‌మెంట్ ఇచ్చింది. దీంతో తమిళ, మలయాళ, తెలుగు నిర్మాతలు అవాక్కయ్యారు. ఇన్నాళ్లూ లేంది ఇప్పుడు ఇదేమిటి కొత్తగా ఉంది అని చర్చిస్తున్నారు. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా రెమ్యునరేషన్ తీసుకుంటున్న కాజల్ అగర్వాల్ ఇప్పుడు నేను సైతం బికినీకి రెడీ అని అందరికీ షాక్ ఇచ్చింది. ఇంతకీ కాజల్ ని బికినీలో చూడగలమా అనేది మరికొందరిలో మెదిలిన ప్రశ్న.


Click it and Unblock the Notifications











