SSMB28: మహేశ్ తల్లిగా ఒకప్పటి స్టార్ హీరోయిన్.. ఆమె రోల్ ఎలా ఉంటుందో తెలిస్తే!

సూపర్ స్టార్ కృష్ణ కుమారుడిగా సినిమా రంగానికి పరిచయమైనా.. తనదైన యాక్టింగ్, ఫైట్స్, ఎమోషన్స్‌తో పాటు హ్యాడ్సమ్ లుక్స్‌తో సుదీర్ఘ కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్‌గా వెలుగొందుతోన్నాడు మహేశ్ బాబు. గతంలో కంటే ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌లో ఉన్న అతడు.. వరుస పెట్టి సినిమాలను చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే గత ఏడాది 'సర్కారు వారి పాట' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ ఫలితం విషయంలో సంతృప్తిగానే ఉన్న మహేశ్.. ఆ వెంటనే ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుని ముందుకు సాగుతున్నాడు.

సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా ఫుల్ లెంగ్త్ కమర్షియల్ జోనర్‌లో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితమే మొదలైంది. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్‌లో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేసుకున్నారు. ఈ పార్ట్ మొత్తం సూపర్బ్‌గా వచ్చినట్లు తెలిసింది. ఇక, దీనికి సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను జనవరి 18వ తేదీ నుంచి మొదలెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే న్యూస్ వైరల్ అవుతోంది.

Kajol Key Role in Mahesh Babu and Trivikram Movie

త్రివిక్రమ్ శ్రీనివాస్ - సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందించబోతున్నట్లు ఇప్పటికే ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఇందులో భాగంగానే చాలా మంది వేరే ఇండస్ట్రీలకు చెందిన నటీనటులను తీసుకుంటున్నారు. తాజాగా ఈ మూవీలో మహేశ్ బాబు తల్లిగా బాలీవుడ్ బ్యూటీఫుల్ హీరోయిన్ కాజోల్‌ను తీసుకున్నట్లు తెలిసింది. ఓ కంపెనీకి సీఈవోగా ఆమె ఇందులో నటించబోతున్నారట. ఎంతో హుందాగా ఉండే ఈ పాత్రకు ఆమె అయితేనే సెట్ అవుతుందని గురూజీ ఆమెను ఎంపిక చేశారని అంటున్నారు.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. ఇక, దీనికి 'అర్జునుడు', 'అతడే పార్థు' వంటి టైటిళ్లు పరిశీలిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టు 11న విడుదల చేయబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X