Kalki2: ప్రభాస్ కల్కి 2 లో ఆలియా భట్? నాగ్ అశ్విన్ ఆలోచనలే వేరబ్బా!

Kalki2: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సినిమా కల్కి 2898 AD. ఈ సినిమా భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మక సైన్స్ ఫిక్షన్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. పురాణాలను భవిష్యత్ ప్రపంచంతో మిళితం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించింది. బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించిన ఈ మూవీకి ఇప్పుడు సీక్వెల్‌గా కల్కి 2 రాబోతుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటికే కల్కి 2పై అధికారికంగా కీలక అప్‌డేట్స్ ఇచ్చిన దర్శకుడు నాగ్ అశ్విన్, సినిమా స్క్రిప్ట్ పనులు పూర్తిస్థాయిలో సాగుతున్నాయని వెల్లడించారు. జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని, ఏప్రిల్ 2027 నాటికి షూటింగ్ పూర్తి చేసి, డిసెంబర్ 2027లో సినిమాను విడుదల చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్‌లకు సంబంధించిన కొన్ని సీన్స్ షూటింగ్ కూడా ప్రారంభమైనట్లు సమాచారం.

Kalki 2 Alia Bhatt to Join Prabhas

అయితే ఇప్పుడు సినీ వర్గాల్లో మరో ఆసక్తికర చర్చ నడుస్తోంది. కల్కి 2లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ నటించే అవకాశాలపై గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తకు సంబంధించి మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా, ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం ఇది హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాకుండా ఆలియా ఇప్పటికే తన పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాల చిత్రీకరణలో కూడా పాల్గొన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

ఈ వార్త నిజమైతే నాగ్ అశ్విన్ ప్లానింగ్ మరో స్థాయిలో ఉందనే చెప్పాలి. ఇప్పటికే ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి భారీ తారాగణంతో మొదటి భాగాన్ని రూపొందించిన నాగ్ అశ్విన్, సీక్వెల్ కోసం మరింత పెద్ద స్థాయిలో స్టార్ పవర్‌ను తీసుకురావాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో అత్యంత డిమాండ్ ఉన్న నటీమణుల్లో ఒకరైన ఆలియా భట్‌ను తీసుకోవడం ద్వారా హిందీ మార్కెట్‌ను మరింత బలోపేతం చేయాలనే వ్యూహం ఉండొచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరోవైపు మొదటి భాగంలో కీలక పాత్ర పోషించిన దీపికా పదుకొణె ఈ సీక్వెల్‌ నుంచి తప్పుకుంది. దీంతో ఆమె స్థానంలో సాయి పల్లవి నటించే అవకాశాలపై కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆలియా భట్ పేరు కూడా తెరపైకి రావడంతో అసలు హీరోయిన్ ట్రాక్ ఎలా ఉండబోతోందనే ఆసక్తి పెరిగింది. నాగ్ అశ్విన్ మాత్రం ఈ విషయాలపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా సస్పెన్స్ కొనసాగిస్తున్నారు.

కల్కి 2 లో కమల్ హాసన్ పోషిస్తున్న సుప్రీమ్ యాస్కిన్ పాత్రకు అత్యంత ప్రాధాన్యత ఉండబోతోందని ఇప్పటికే సంకేతాలు వచ్చాయి. మొదటి భాగంలో కొద్దిసేపే కనిపించిన ఈ పాత్ర సీక్వెల్‌లో ప్రధాన ఆకర్షణగా మారనుంది. అదే సమయంలో ప్రభాస్ పాత్ర అయిన భైరవ ప్రయాణం కూడా మరింత శక్తివంతంగా, భావోద్వేగపూరితంగా ఉండబోతుందని తెలుస్తోంది. అందుకే కథ, విజువల్ ఎఫెక్ట్స్, వరల్డ్ బిల్డింగ్ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా నాగ్ అశ్విన్ ముందుకు వెళ్తున్నారు.

వాస్తవానికి కల్కి 2898 AD విజయానికి ప్రధాన కారణాల్లో ఒకటి దాని క్యాస్టింగ్. అమితాబ్ బచ్చన్ నుంచి కమల్ హాసన్ వరకు, దీపికా పదుకొణె నుంచి ప్రభాస్ వరకు ప్రతి పాత్రకు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు సీక్వెల్‌లో ఆలియా భట్ కూడా జాయిన్ అయితే ఈ ప్రాజెక్ట్‌కు పాన్ ఇండియా లెవల్ లో మరింత క్రేజ్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తరాదిలో ఆలియాకు ఉన్న మార్కెట్, ప్రభాస్‌కు ఉన్న పాన్ ఇండియా ఇమేజ్ కలిస్తే కల్కి 2 బిజినెస్ కొత్త రికార్డులు సృష్టించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఆలియా భట్ ఎంట్రీపై అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే.

Read more about: nag ashwin alia bhatt prabhas
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X