Kalki 2 Heroine: ప్రభాస్ కల్కి2 లో వారణాసి బ్యూటీ..దీపికను మరిపించగలదా?
Kalki 2: ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో రూపొందిన పాన్ ఇండియా మూవీ కల్కి 2898 AD. ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిని దాటి, ఇంటర్నేషనల్ లెవల్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా బాక్సాఫీస్ లోని పలు రికార్డులను బ్రేక్ చేసి, సరికొత్త రికార్డులను తిరగరాసింది. విజువల్ కాన్సెప్ట్,సోర్టీ, స్టార్ పవర్ కలయికతో భారతీయ సినిమాకు కొత్త నిర్వచనం ఇచ్చింది. దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మైథో-సైఫై ఎపిక్ మూవీ రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రభాస్ కెరీర్‌కు పాన్ వర్డల్ స్థాయికి తీసుకెళ్లింది. ఇలాంటి బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ గా కల్కి 2 మూవీ రాబోతుంది. ఈ అయితే.. ఈ సినిమా నుంచి హీరోయిన్ దీపికా పదుకొణే వైదొలిగిన విషయం తెలిసిందే. ఆ అమ్మడు ఫ్లేస్ లో వారణాసి బ్యూటీ రాబోతుందట. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు?
కల్కి 2898 AD మొదటి పార్ట్‌లో దీపిక పదుకొణే ప్రధాన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఆ పాత్రకు దీపిక ప్రాణం పోసింది అనడంలో అతిశయోక్తి కాదు. అయితే సీక్వెల్ ప్రారంభానికి ముందు మేకర్స్ ఆమెను ప్రాజెక్ట్ నుంచి తప్పించడం ఇండస్ట్రీ మొత్తాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ నిర్ణయం వెనుక దీపిక 'రోజుకు 8 గంటలే పని' అనే వ్యాఖ్యలే కారణమని ప్రచారం. ఇదే కారణంతో ఆమెను ప్రభాస్ మూవీ 'స్పిరిట్' ప్రాజెక్ట్ నుంచి కూడా తొలిగించారనే వార్తలు వచ్చాయి. ఆసక్తికర విషయం ఏమిటంటే..ఈ రెండు సినిమాలుప్రభాస్‌కే సంబంధించినవే.

సీక్వెల్ కోసం కొత్త హీరోయిన్?
ఈ భారీ బడ్జెట్ మూవీ నుంచి దీపికా వైదొలిగిన వెంటనే సాయి పల్లవి, అనుష్క శెట్టి, శ్రుతి హాసన్ వంటి పేర్లు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యాయి. మేకర్స్ వైపు నుంచి అధికారిక వ్యాఖ్య రాకపోయినా, అభిమానులు మాత్రం ప్రభాస్ సరిపోయే హీరోయిన్ ఎవరు? అని సోషల్ మీడియాలో తరుచు చర్చ జరుగుతుంటుంది. ఈ క్రమంలో టాలీవుడ్ సర్కిల్స్‌లో తాజాగా వినిపిస్తున్న పేరు ప్రియాంకా చోప్రాదే. ఇండియన్ సినిమా నుంచి ప్రపంచస్థాయికి ఎదిగిన ఈ నటి, హాలీవుడ్ మార్కెట్‌లో ఉన్న భారీ ఫాలోయింగ్ ఈ బ్యూటీ .. కల్కి సీరిస్‌కి బెస్ట్ ఛాయిస్ అనీ, అంతర్జాతీయ రేంజ్ అందిస్తుందని మేకర్స్ భావిస్తున్నారట.
ప్రియాంక చోప్రా.. ఇప్పటికే ఆమె రాజమౌళి- మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న 'వారణాసి' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆ మూవీ ఫేమ్ కూడా ఆమెకు కలసి వస్తుందనీ, ఈ అమ్మడును కల్తీ 2 లోకి తీసుకుంటే.. గ్లోబల్ మార్కెట్, హాలీవుడ్ మార్కెట్ లో కూడా మంచి వసూళ్లు సాధించవచ్చని తెలుస్తోంది. ఇండియాన్ బాక్సాఫీస్ లక్ష్యంగా చేసుకోవాలని నిర్మాతల ఆలోచన అన్న టాక్ వినిపిస్తోంది.
కల్కి 2898 AD మొదటి భాగంలో ప్రభాస్‌తో పాటు మిథాలజికల్ ఎలిమెంట్స్, సై-ఫై ఫ్యూచర్ వరల్డ్, కథలోని ఎమోషన్ అన్ని కలిపి సినిమా సెన్సేషన్‌గా మారింది. భారీ విజయం సాధించిన ఈ మూవీ సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఆతృతతో ఎదురుచూడేలా చేశాయి. కల్కి 2 కథలో మార్పులు, కాస్టింగ్ మార్పులు అన్ని కలిపి మూవీపై అంచనాలను మరింత పెంచుతున్నాయి.
అయితే.. దీపికా స్థానం భర్తీ చేసే లీడింగ్ లేడీపై మేకర్స్ ఇంకా అధికారికంగా ఏమీ చెప్పలేదు. అయితే ప్రియాంకా చోప్రా పేరు ఇండస్ట్రీలో మారుమోగుతోంది. ప్రభాస్‌తో కల్కి విశ్వంలో అడుగు పెట్టేది ప్రియాంకా చోప్రానేనా? లేక మరో హీరోయిన్ నా? అనేది వేచి చూడాలి. ఒకవేళ ఈ దీపిక ప్లేస్ లో ప్రియాంక వస్తే మాత్రం.. అటు రాజమౌళి వారణాసి, ప్రభాస్ కల్కీ 2 ఆమె కెరీర్ లో మైలురాళ్లుగా నిలిచిపోవడం ఖామమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











