Kalki 2: నాగ్ అశ్విన్ మాస్టర్ ప్లాన్.. ఆ 20 నిమిషాలు మాత్రం గూస్‌బంప్స్..

Kalki 2: పాన్ ఇండియా సినిమాగా సంచలనం సృష్టించిన మూవీ కల్కి 2898 AD. ఈ మూవీకి సీక్వెల్ గా వస్తున్న కల్కి2 పై అందరి చూపు నిలిచింది. పాన్ ఇండియ స్టార్ ప్రభాస్, క్రియేటీవ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కుతున్న 'కల్కి 2'పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. కల్కి పార్ట్ 1 భాగంలో ఇచ్చిన క్లైమాక్స్ లీడ్స్, ముఖ్యంగా మహాభారతానికి సంబంధించిన సన్నివేశాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచగా... ఇప్పుడు ఆ అంశాలను మరింత విస్తరించేందుకు నాగ్ అశ్విన్ భారీ ప్లాన్ సమాచారం.

ఈ సీక్వెల్‌లో ప్రధాన హైలైట్‌గా మహాభారతం ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ సుమారు 20 నిమిషాల పాటు సాగనున్నదట. ఇందులో అశ్వత్థామ శాపం, కర్ణుడి వీరత్వం, శ్రీకృష్ణుడి వ్యూహాలు వంటి అంశాలను అత్యంత గ్రాండియర్‌గా చూపించబోతున్నారట. పురాణ గాథలను సైన్స్ ఫిక్షన్‌తో మేళవిస్తూ, ఈ ఎపిసోడ్‌ను కొత్త స్థాయిలో తెరకెక్కిస్తున్నారని టాక్.

థియేటర్లలో ఈ సీక్వెన్స్ ప్రేక్షకులకు మునుపెన్నడూ లేని విజువల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వనుందనే అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ నటిస్తున్న భైరవ పాత్ర మరింత కీలకంగా మారనుంది. మొదటి భాగం చివరలో కర్ణుడితో ఉన్న లింక్ రివీల్ కావడంతో, రెండో భాగంలో ఆయన పూర్తి స్థాయి విశ్వరూపం చూపించబోతున్నారని సమాచారం.

Kalki 2 Prabhas - Nag Ashwin s 20-Min Mahabharata Episode to Deliver Goosebumps

యాక్షన్ ఎపిసోడ్స్‌తో పాటు భావోద్వేగ సన్నివేశాలు కూడా ఈసారి ఎక్కువ ప్రాధాన్యతను పొందుతున్నాయి. ఇక ఈ ప్రాజెక్ట్‌లో అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా, కమల్ హాసన్ సుప్రీమ్ యాస్కిన్ పాత్రలో మరింత పవర్ ఫుల్‌గా కనిపించనున్నారు. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా అశ్వత్థామ - యాస్కిన్ మధ్య జరిగే భావోద్వేగ, తాత్విక ఘర్షణ కథను మరో లెవల్‌కు తీసుకెళ్తుందని అంచనా.

ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా, త్వరలోనే ప్రభాస్‌లో జాయిన్‌ కా సెట్స్‌పై సమాచారం అందుతుంది. వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్‌తో ఈ విధంగా నిర్మిస్తుండగా, హాలీడ్ స్థాయి VFX, సెట్ డిజైన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈసారి మరింత గంభీరంగా ఉండబోతోందని తెలుస్తోంది.

ఇక ఈ సీక్వెల్‌కు 'కర్ణ 3102 బీసీ' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. కథ ప్రధానంగా మహాభారత కాలంతో ముడిపడి ఉండటంతో, కురుక్షేత్ర యుద్ధం, అశ్వత్థామ శాపం, కర్ణుడి పాత్ర వంటి అంశాలను ప్రస్తుత కాలంతో కలిపి చూపించ బోతున్నారని సమాచారం.

మరోవైపు, ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా కమల్ హాసన్ పాత్ర మరింత విస్తరించనుండగా, ఆయనకు తోడుగా మరో బాలీవుడ్ నటుడు నెగిటివ్ రోల్‌లో కనిపించబోతున్నట్లు టాక్. ఈ కొత్త విలన్ క్యారెక్టర్ ప్రభాస్ పాత్రకు గట్టి సవాల్ విసరనుందని అంటున్నారు. అలాగే ఈ షెడ్యూల్‌లో దుల్కర్ సల్మాన్, జేడీ చక్రవర్తి వంటి నటులు కూడా భాగమవుతున్నట్లు సమాచారం.

ఇలా 'కల్కి 2' కేవలం సీక్వెల్ మాత్రమే కాదు.. ఇండియన్ సినిమా స్థాయిని ప్రపంచానికి చూపించే మరో విజువల్ స్పెక్టకిల్‌గా మారబోతోంది. ముఖ్యంగా ఆ 20 నిమిషాల మహాభారత ఎపిసోడ్ సినిమా మొత్తానికి హార్ట్‌గా నిలిచిపోయింది, ప్రేక్షకులకు గూస్‌బంప్స్ ఇవ్వడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు విశ్వసిస్తున్నాయి. ఇప్పుడు ఈ భారీ ప్రాజెక్ట్ అధికారిక రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

More from Filmibeat

Read more about: kalki 2898 ad prabhas nag ashwin
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X