కల్కి 2లో కోలీవుడ్ స్టార్ హీరో ఎంట్రీ.. నాగ్ అశ్విన్ ప్లానింగ్ మామూలుగా లేదుగా!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కల్కి 2898 ఏడీ'(Kalki 2898 AD) సినిమా భారత బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించింది. ఇలా రికార్డు విజయాన్ని అందుకున్న ఈ సినిమా సీక్వెల్‌పై డైరెక్టర్ నాగ్ ఆశ్విన్ (Nag Ashwin)ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. సైన్స్ ఫిక్షన్, పురాణాల మేళవింపుతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు రెండో భాగంపై వస్తున్న వార్తలు అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. తాజాగా ఈ భారీ ప్రాజెక్ట్ లో కోలీవుడ్ స్టార్ హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నారట. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు? ఇంతకీ నాగ్ మామ ప్లానింగ్ ఏంటీ?
కల్కి 2పై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. కల్కి మొదటి భాగం ముగిసిన విధానం చూస్తేనే సీక్వెల్ మరింత గ్రాండ్‌గా ఉండబోతుందని క్లియర్ అయింది. ముఖ్యంగా చివర్లో ప్రభాస్ పాత్రను కర్ణుడితో అనుసంధానం చేయడం ప్రేక్షకులకు భారీ సర్ప్రైజ్ ఇచ్చింది. భైరవ పాత్ర వెనుక మరింత గొప్ప రహస్యం ఉందని సూచించిన నాగ్ అశ్విన్, రెండో భాగంలో ఆ కథను మరింత లోతుగా చెప్పబోతున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

కల్కి 2కు సంబంధించిన మరో ఆసక్తికర విషయం టైటిల్. కథలో కర్ణుడి ప్రాధాన్యం పెరగనున్న నేపథ్యంలో కర్ణ 3102 BC అనే టైటిల్‌ను కూడా పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఏదీ లేదు. కానీ మొదటి భాగం చివర్లో ఇచ్చిన ట్విస్ట్ చూస్తే, కర్ణుడి గతం, పునరాగమనం, మహాభారత సంబంధిత అంశాలు కథలో కీలకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే.. ప్రభాస్ మూడో పాత్రలో కనిపిస్తాడని వస్తున్న ప్రచారం తప్పని, ఆయన ఇప్పటికే కర్ణుడి మైథాలజికల్ షేడ్‌లో ఉన్న పాత్రనే పోషిస్తున్నారని అంటున్నారు. మరో కొత్త అవతారం కంటే, భైరవ పాత్రనే కొత్త మేకోవర్‌లో చూపించే అవకాశముందని చర్చ జరుగుతోంది. ఇది ఫ్యాన్స్‌కు పెద్ద సర్ప్రైజ్ అవుతుందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
తాజాగా సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. కల్కి 2లో క్లైమాక్స్‌కు కీలకమైన ఒక పవర్‌ఫుల్ స్పెషల్ రోల్ ఉండబోతుందట. ఆ పాత్ర కోసం తమిళ స్టార్ హీరో శింబును సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఈ వార్త నిజమైతే, ఇది పాన్ ఇండియా స్థాయిలో మరో భారీ సర్ప్రైజ్‌గా మారే అవకాశం ఉంది. తమిళ ప్రేక్షకుల్లో శింబుకు ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా, సినిమా మార్కెట్ మరింత విస్తరించే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ప్రస్తుతం హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ కోసం భారీ సెట్స్ నిర్మించినట్లు సమాచారం. ముఖ్యంగా యుద్ధభూమిని తలపించేలా, భవిష్యత్ నగర నిర్మాణాన్ని గుర్తు చేసేలా ప్రత్యేకంగా ఆర్ట్ డిపార్ట్‌మెంట్ పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమిత్ బచ్చన్, కమల్ హసన్ మధ్య పలు యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంకా దుల్కార్ సల్మాన్, జేడీ చక్రవర్తి వంటి నటులు కూడా షూటింగ్‌లో భాగమవుతున్నట్లు సమాచారం. దీంతో కల్కి 2కి భారీ తారాగణం సిద్ధమవుతోంది.
మొదటి భాగంలో ఉన్న స్టార్లతో పాటు కొత్త సర్ప్రైజ్ ఎంట్రీలు ఉంటే, ఈ సినిమా స్థాయి మరింత పెరిగే అవకాశం ఉంది. మొత్తానికి, కల్కి 2 సాధారణ సీక్వెల్ కాదు... ఇండియన్ సినిమా స్కేల్‌ను మరోసారి ప్రపంచానికి చూపించే ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటోందని స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పుడు అందరి చూపు ఒక్కటే... నాగ్ అశ్విన్ ఈసారి ఎలాంటి మ్యాజిక్ చూపిస్తాడన్నదానిపైనే ఉంది.


Click it and Unblock the Notifications