‘కల్కి 2'లో మరో బాలీవుడ్ నటుడు.. అసలు నాగ్ అశ్విన్ ప్లాన్ ఏంటి?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కల్కి 2898 ఏడీ'(Kalki 2898 AD). ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా సీక్వెల్‌పై డైరెక్టర్ నాగ్ ఆశ్విన్ (Nag Ashwin)ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. సైన్స్ ఫిక్షన్, పురాణాల మేళవింపుతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు రెండో భాగంపై వస్తున్న వార్తలు అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. తాజాగా ఈ భారీ ప్రాజెక్ట్ లో బాలీవుడ్ స్టార్ హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నారట. ఇంతకీ ఆ బాలీవుడ్ స్టార్ హీరో ఎవరు? ఇంతకీ నాగ్ మామ ప్లానింగ్ ఏంటీ?
'కల్కి 2898 ఏడీ' కి సీక్వెల్‌గా రాబోతున్న 'కల్కి 2'పై రోజురోజుకు అంచనాలు అమాంతం పెరుగుతున్నాయి. మొదటి భాగం ముగిసిన విధానం చూస్తేనే రెండో భాగం మరింత భారీ స్థాయిలో ఉండబోతుందని ప్రేక్షకులకు క్లియర్ అయింది. ముఖ్యంగా చివరి సన్నివేశాల్లో ప్రభాస్ పాత్ర భైరవను కర్ణుడితో అనుసంధానం చేస్తూ ఇచ్చిన ట్విస్ట్ థియేటర్లలో ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించింది. దీంతో రెండో భాగం పూర్తిగా కర్ణుడి చుట్టూ తిరుగుతుందనే చర్చ మొదలైంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, నాగ్ అశ్విన్ ఈసారి మహాభారతపు ఎమోషన్స్, యుద్ధాలు, పురాణాల డెప్త్‌ను మరింత గ్రాండ్‌గా చూపించబోతున్నారట. ముఖ్యంగా కర్ణుడి గతం, అతని పునరాగమనం, కలియుగంతో అతని సంబంధం వంటి అంశాలు కథలో కీలకంగా మారనున్నాయని టాక్ వినిపిస్తోంది.

ఇక ఈ సీక్వెల్‌కు సంబంధించిన మరో ఆసక్తికర అంశం టైటిల్. ప్రస్తుతం 'కర్ణ 3102 BC' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సినీ వర్గాల్లో బలంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రాకపోయినా, కథలో కర్ణుడి ప్రాధాన్యం పెరగనున్న నేపథ్యంలో ఈ టైటిల్‌కు మంచి ప్రాధాన్యం ఏర్పడింది. మొదటి భాగంలో భైరవ పాత్రను భవిష్యత్ ప్రపంచానికి చెందిన వ్యక్తిగా చూపించినా, చివర్లో అతడే కర్ణుడని రివీల్ చేయడంతో సీక్వెల్‌పై ఆసక్తి మరింత పెరిగింది.
ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మరో వార్త ఏమిటంటే.. ఈ భారీ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ (Vivek Oberoi) కీలక పాత్రలో కనిపించబోతున్నారట. తాజా సమాచారం ప్రకారం, కొత్త షూటింగ్ షెడ్యూల్‌లో వివేక్ ఒబెరాయ్ జాయిన్ కానున్నారని తెలుస్తోంది. అంతేకాదు, ఆయన పాత్రకు కథలో మంచి ప్రాధాన్యం ఉంటుందని సమాచారం. ముఖ్యంగా ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో వివేక్ ఒబెరాయ్ కనిపించనున్నారని టాక్ నడుస్తోంది. దీంతో ఇప్పటికే భారీ తారాగణం కలిగిన ఈ చిత్రానికి మరింత స్టార్ పవర్ జత కాబోతోందని అభిమానులు భావిస్తున్నారు.
మరోవైపు, కమల్ హాసన్ పోషిస్తున్న సుప్రీం యాస్కిన్ పాత్ర రెండో భాగంలో మరింత భయంకరంగా ఉండబోతుందనే ప్రచారం జరుగుతోంది. పార్ట్ 1లో ఆయన పాత్రను పూర్తిగా రివీల్ చేయకపోయినా, సీక్వెల్‌లో యాస్కిన్ వర్సెస్ కర్ణుడు యుద్ధం ప్రధాన ఆకర్షణగా నిలవనుందని సమాచారం. అలాగే అశ్వత్థామ పాత్రలో అమితాబ్ బచ్చన్ మరోసారి పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ కోసం భారీ సెట్స్ నిర్మిస్తున్నట్లు సమాచారం. భవిష్యత్ నగరాలను తలపించే విజువల్స్‌తో పాటు, మహాభారత యుద్ధభూమిని గుర్తు చేసేలా ప్రత్యేక సెట్స్ రెడీ చేస్తున్నారట.
ఆర్ట్ డిపార్ట్‌మెంట్, విజువల్ ఎఫెక్ట్స్ టీమ్ ఈసారి మరింత హై లెవెల్‌లో పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హాలీవుడ్ స్థాయి యాక్షన్ సీక్వెన్సులు, గ్రాఫిక్స్, భారీ వార్ ఎపిసోడ్స్ ఈ చిత్రానికి ప్రధాన హైలైట్ కానున్నాయని అంటున్నారు. అలాగే దుల్కర్ సల్మాన్, జేడీ చక్రవర్తి వంటి నటులు కూడా ఈ షెడ్యూల్‌లో భాగమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొదటి భాగంలో ఉన్న తారాగణంతో పాటు కొత్త సర్ప్రైజ్ ఎంట్రీలు కూడా ఉండబోతున్నాయనే టాక్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచుతోంది.
వైజయంతీ మూవీస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా సాధారణ సీక్వెల్ కాదు.. ఇండియన్ సినిమా స్కేల్‌ను మరోసారి ప్రపంచానికి చూపించే ప్రయత్నంగా మారబోతోందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. 'బాహుబలి' తర్వాత ప్రభాస్ కెరీర్‌లో మరో గ్లోబల్ లెవెల్ ఫ్రాంచైజీగా 'కల్కి' నిలవనుందనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే పార్ట్ 1తో ప్రేక్షకుల్లో అపారమైన ఆసక్తిని రేకెత్తించిన నాగ్ అశ్విన్.. రెండో భాగంలో మరింత భారీ విజువల్స్, బలమైన ఎమోషన్స్, పురాణ గాథలతో ప్రేక్షకులను ఆశ్చర్యపరచడానికి సిద్ధమవుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు అందరి చూపు ఒక్కటే.. 'కల్కి 2'తో నాగ్ అశ్విన్ ఇంకెంత పెద్ద మ్యాజిక్ చూపించబోతున్నారు అన్నదానిపైనే ఉంది.


Click it and Unblock the Notifications





