దెబ్బకు దెబ్బ: పవన్ కళ్యాణ్‌కు రాజశేఖర్ కౌంటర్ ఇచ్చాడా?

Recommended Video

Is This Rajasekhar's Counter To Gabbar Singh Punch? || Filmibeat Telugu

పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన 'గబ్బర్ సింగ్' ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో రౌడీ గ్యాంగ్‌తో పాటలు పాడించే సీన్ సినిమా మొత్తానికే హైలెట్. ఈ సీన్లో ఓ కమెడియన్‌తో హీరో రాజశేఖర్ సూపర్ హిట్ రోజా పువ్వా సాంగ్ ఇమిటేట్ చేయించడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది.

రాజశేఖర్‌ డాన్సింగ్ స్టెప్స్, మ్యానరిజం ఇమిటేట్ చేయించడం.... దానికి పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవుతూ ఏమి చేస్తిరి.. ఏమి చేస్తిరి.. ఎప్పుడు ఇలాగే చేస్తిరా... ఈ మధ్యనే ఇలాగ చేస్తున్నారా? అంటూ కౌంటర్ ఇవ్వడం తెలిసిందే. అప్పట్లో సినిమా విడుదలవ్వడానికి ముందు చిరంజీవి, రాజశేఖర్ మధ్య ఓ విషయంలో వివాదం నడుస్తుండటంతో పవన్ కళ్యాణ్ కావాలనే కౌంటర్ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది.

అప్పట్లోనే జీవిత అభ్యంతరం

అప్పట్లోనే జీవిత అభ్యంతరం

‘గబ్బర్ సింగ్' సినిమా రిలీజ్ తర్వాత.... రాజశేఖర్‌పై పరోక్షంగా సెటైర్లు వేశారనే వార్తలు తెరపైకి వచ్చాయి. అప్పట్లో ఈ అంశంపై రాజశేఖర్ వైప్ జీవిత రియాక్ట్ అవుతూ కావాలనే మాపై ఇలాంటివి చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటివి చేస్తూ ఊరుకునేది లేదంటూ ఫైర్ అయిన సంగతి తెలిసిందే.

ఇన్నేళ్ల తర్వాత దెబ్బకు దెబ్బ

ఇన్నేళ్ల తర్వాత దెబ్బకు దెబ్బ

‘గబ్బర్ సింగ్' సినిమా విషయంలో జరిగిన దానికి హీరో రాజశేఖర్ మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ప్రతీకారం తీర్చుకున్నారని, త్వరలో విడుదల కాబోతున్న ‘కల్కి' మూవీ ద్వారా దెబ్బకు దెబ్బ కొట్టబోతున్నారంటూ ఓ ప్రచారం తెరపైకి వచ్చింది. గురువారం విడుదలైన ‘కల్కి' టీజర్లో ఇందుకు సంబంధించిన అంశాలు స్పష్టంగా కనిపించాయి.

అదే నటుడితో మళ్లీ...

అదే నటుడితో మళ్లీ...

గతంలో ‘గబ్బర్ సింగ్' చిత్రంలో ఏ నటుడితో అయితే తనను ఇమిటేట్ చేయించారో.... అదే నటుడితో ‘కల్కి'లో ఓ సీన్ పెట్టించారు. పోలీస్ గెటప్‌లో ఉన్న రాజశేఖర్ ఆ నటుడిని తన కాలుతో తన్నినట్లు చూపించారు. ట్రైలర్లో ఈ సీన్ పూర్తిగా లేదు, ‘కల్కి' మూవీ విడుదలైతే కానీ తప్ప దీన్ని ఎలా డిజైన్ చేశారనే దానిపై క్లారిటీ రానుంది.

అంచనాలు పెంచిన ట్రైలర్

రాజ‌శేఖ‌ర్ హీరోగా ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో సి.కళ్యాణ్ నిర్మిస్తోన్న చిత్రం ‘క‌ల్కి'. శివానీ శివాత్మిక స‌మ‌ర్ప‌ణ‌లో హ్య‌ాపీ మూవీస్ బ్యాన‌ర్‌లో రూపొందుతున్న మూవీకి సంబంధించి కమర్షియల్ థియేట్రికల్ ట్రైలర్ గురువారం ‘మహర్షి' మూవీతో పాటు విడుదల చేశారు.

కల్కి

కల్కి

రాజశేఖర్, ఆదా శర్మ, నందిత శ్వేత, స్కార్లెట్ మెల్లిష్ విల్సన్, రాహుల్, రామకృష్ణ, నాజర్, ఆషుతోష్ రానా, సిద్దు జొన్నలగడ్డ, శత్రు, చరణ్ దీప్, వేణు గోపాల్, వెన్నెల రామారావు, డిఎస్ రావు, అమిత్ శర్మ, సతీష్ ముఖ్య పాత్రలు పోషించారు. సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర, సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, స్క్రీన్ ప్లే: స్క్రిప్ట్స్ విల్లే, ఆర్ట్: నాగేంద్ర, ఎడిటర్: గౌతమ్ నెరుసు, ఫైట్స్: నాగ వెంకట్, రాబిన్-సుబ్బు నిర్మాత: సి కళ్యాణ్ దర్శకత్వం: ప్రశాంత్ వర్మ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X