టాప్ దర్శకుడికి హ్యాండ్ ఇచ్చిన భార్య?
ముంబై : ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్, ఆయన భార్య, నటి కల్కి కచ్లిన్ మధ్య సంసారం సజావుగా సాగడం లేదా? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి సినీ వర్గాల నుంచి. వీరిద్దరు విడాకులు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి. అయితే కల్కి కొచ్లిన్ మాత్రం విడాకుల ఉద్దేశ్యం లేదని, కొన్ని కారణాల వల్ల కొంత కాలం భర్తకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని అంటున్నారు. మరి ఆమె మాటల్లో అర్థమేమిటో?
వీరి సంసార జీవితంలో కలతలు రావడానికి కారణం....దర్శకుడు అనురాగ్ కశ్యప్, నటి హుమా ఖురేషితో డేటింగ్ చేయడమే అనే పుకార్లు వినిపిస్తున్నాయి. గ్యాంగ్ ఆఫ్ వస్సే పూర్ చిత్ర సమయంలో అనురాగ్ కశ్యప్, హుమా ఖురేషి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని అని అంటున్నారు. అయితే తమ మధ్య ఎఫైర్ ఉందనే వార్తలను వీరిద్దరు ఖండిస్తున్నారు.
ప్రస్తుతం కల్కి కొచ్లిన్ భర్తను వదిలి విడిగా వేరే ఇంట్లో ఉంటోందని సమాచారం. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్య కశ్యప్ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేక పోయినా.... క్యాట్‌బరీ డెయిరీ మిల్క్ షాట్స్ తెలుగు యాడ్లో ఏంబాబూ లడ్డూ కావాలా? అంటూ దర్శనం ఇస్తున్న సంగతి తెలిసిందే. బొంబాయి బాంబు పేలుళ్లు గూర్చి తీసిన బాలీవుడ్ మూవీ 'బ్లాక్ ఫ్రైడే' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అనురాగ్ కశ్యప్, దాని తరువాత నో స్మోకింగ్, దేవ్ D మరియు గులాల్ చిత్రాలకు పేరుపొందారు.
ఆయన సినిమాల సంగతి పక్కన పెడితే... మొదటి భార్య ఆర్తి బజాజ్‌కు విడాకులు ఇచ్చిన తర్వాత కల్కి కోచ్లిన్‌ని 2011లో పెళ్లి చేసుకున్నాడు. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన 'దేవ్ డి' చిత్రం ద్వారా పాండిచ్చేరికి చెందిన ఈ ఫ్రెంచి సంతతి భామ సినిమా రంగంలో అడుగు పెట్టింది. అలా అనురాగ్ కశ్యప్‌తో ఏర్పడిన పరిచయం కాస్త కల్కి కోచ్లిన్ అతన్ని పెళ్లి చేసుకునే వరకు వెళ్లింది.


Click it and Unblock the Notifications












