ఇంకో దెయ్యం కామెడీ ఈ నెల్లోనే రిలీజ్

By Srikanya

హైదరాబాద్: ప్రేమ కథా చిత్రం, గీతాంజలి, బూచమ్మ బూచోడు ఇలా వరసపెట్టి హర్రర్ కామెడీలు తెలుగు భాక్సాఫీస్ వద్ద తమ సత్తా ఏంటో చూపించాక దర్శక,నిర్మాతల దృష్టి ఈ తరహా చిత్రాలపై పడింది. దాంతో ఇతర భాషల్లో హిట్టైన ఈ తరహా చిత్రాలను సైతం డబ్బింగ్ చేసి సొమ్ము చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే మధుశాలిని ప్రధాన పాత్రలో నటించిన కన్నడ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.

శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక పిక్చర్స్ పతాకంపై మధుశాలిని, కన్నడ వేణు జంటగా కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఓ చిత్రాన్ని తెలుగులో ‘కల్పన గెస్ట్‌హౌస్'గా అనువదిస్తున్నారు. కడియా ల సుబ్రహ్మణ్యం, మాస్టర్ జశ్వంత్ రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన రీరికార్డింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని అక్టోబర్ 30 న విడుదల చేయటానికి నిర్ణయించారు.

Kalpana Guest House: Madhushalini - A ghost in guest house

థ్రిల్లర్ మంజు ఓ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం గూర్చి నిర్మాత కడియాల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ హారర్ సినిమాలను ఇష్టపడేవాళ్లకు ఈ చిత్రం అమితంగా నచ్చుతుందని, తెలుగమ్మాయి మధుశాలినీకి కన్నడలో మంచి పేరు ఈ చిత్రం ద్వారా వచ్చిందని తెలిపారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీపడకుండా పూర్తిచేస్తున్నామని, త్వరలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసి, విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు.

ఈ చిత్రానికి సంగీతం: సాధుకోకిల, సహ నిర్మాత: పాలెపు రామారావు, సమర్పణ: ఏపూరి సతీష్‌కుమార్, నిర్మాతలు: కడియాల సుబ్రహ్మణ్యం, మాస్టర్ జశ్వంత్, దర్శకత్వం: కుమార్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X