మెగా ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. చిరు అల్లుడి పరిస్థితి ఇలా అయిందేంటి?
మెగా ఫ్యామిలీ నుంచి గత సంవత్సరం మరో హీరో వచ్చిన విషయం తెలిసిందే. ఆయన మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కల్యాణ్ దేవ్. చిరు చిన్న కూతురు శ్రీజ భర్తే ఈ కల్యాణ్ దేవ్. చిరు అల్లుడిగా పరిచయం అయినప్పటికీ, ఆ ముద్ర పడకుండా తనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలనే లక్ష్యంతో సినీ రంగంలోకి అడుగు పెట్టాడు. ఈ క్రమంలోనే 'విజేత' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కళ్యాణ్ దేవ్ సరసన మాళవిక నాయర్ నటించింది.
గతంలో చిరంజీవి ఎవర్‌గ్రీన్ మూవీ టైటిల్‌ను పెట్టడంతో పాటు ఏకంగా మెగాస్టారే ఈ సినిమా కోసం ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టడంతో, 'విజేత' భారీ విజయం సాధిస్తుందని అంతా అనుకున్నారు. అయితే, ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. అలాగే, కల్యాణ్ దేవ్ లుక్స్ పరంగా ఆకట్టుకున్నప్పటికీ, నటనలో కొంత మెరుగు పడాలని సినీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈ సినిమా నిరాశకు గురి చేయడంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో కల్యాణ్ మరో సినిమాకు సంతకం చేశాడు.

ప్రస్తుతం పులి వాసు అనే కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్నాడు కళ్యాణ్. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాతో ఎలాగైనా మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలని అనుకున్నాడు. అందుకు అనుగుణంగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. షూటింగ్ కూడా దాదాపుగా పూర్తయింది. ఇలాంటి సమయంలో మెగా అభిమానులకు షాక్‌కు గురి చేసే వార్త ఒకటి బయటకు వచ్చింది.
అదే.. కల్యాణ్ దేవ్ సినిమా ఆగిపోయిందనే వార్త. షూటింగ్ ముగిసే సమయానికి ఈ సినిమా రషెష్ చూసిన హీరో.. దీనిపై సంతృప్తిగా లేడట. దీంతో దర్శకుడికి సినిమా ఆపేయమని చెప్పాడని ఓ వార్త ఫిలింనగర్ వర్గాల్లో హల్‌చల్ చేస్తోంది. దీంతో మెగా అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఈ సినిమాలో నరేష్, రాజేంద్ర ప్రసాద్, పోసాని లాంటి సీనియర్ నటులు నటించారు.


Click it and Unblock the Notifications











