twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మెగా హీరో మళ్లీ మొదలెట్టేస్తున్నాడు

    |

    మెగా ఫ్యామిలీ నుంచి గత సంవత్సరం మరో హీరో వచ్చిన విషయం తెలిసిందే. ఆయన మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కల్యాణ్ దేవ్. చిరు చిన్న కూతురు శ్రీజ భర్తే ఈ కల్యాణ్ దేవ్. చిరు అల్లుడిగా పరిచయం అయినప్పటికీ, ఆ ముద్ర పడకుండా తనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలనే లక్ష్యంతో సినీ రంగంలోకి అడుగు పెట్టాడు. ఈ క్రమంలోనే 'విజేత' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కళ్యాణ్ దేవ్ సరసన మాళవిక నాయర్ నటించింది.

    గతంలో చిరంజీవి ఎవర్‌గ్రీన్ మూవీ టైటిల్‌ను పెట్టడంతో పాటు ఏకంగా మెగాస్టారే ఈ సినిమా కోసం ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టడంతో, 'విజేత' భారీ విజయం సాధిస్తుందని అంతా అనుకున్నారు. అయితే, ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. అలాగే, కల్యాణ్ దేవ్ లుక్స్ పరంగా ఆకట్టుకున్నప్పటికీ, నటనలో కొంత మెరుగు పడాలని సినీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈ సినిమా నిరాశకు గురి చేయడంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో కల్యాణ్ మరో సినిమాకు సంతకం చేశాడు.

    Kalyaan Dhev movie Will Start in Few days

    ప్ర‌స్తుతం పులి వాసు అనే కొత్త ద‌ర్శ‌కుడితో సినిమా చేస్తున్నాడు క‌ళ్యాణ్. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాతో ఎలాగైనా మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలని అనుకున్నాడు. అందుకు అనుగుణంగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. షూటింగ్ కూడా దాదాపుగా పూర్తయింది. ఇలాంటి సమయంలో ఈ సినిమాను ఆపేశారని ప్రచారం జరిగింది.

    తాజాగా ఈ సినిమా గురించి మరో అప్‌డేట్ బయటకు వచ్చింది. ఆగిపోయిన ఈ సినిమాను త్వరలోనే ప్రారంభించబోతున్నారనేదే దాని సారాంశం. ఒకే షెడ్యూల్‌లో మిగిలిన వర్క్‌ను చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్‌కు సంబంధించిన షూట్ చేయనున్నారని టాక్.

    English summary
    Mega Star chiranjeevi son in law Kalyaan Dhev Tollywood Entry In Last Year. His First Film Is Vijetha. Then He Started second Movie With Puli vasu. Few days back This Movie Was Stalled.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X