సైలెంట్ గా కళ్యాణ్ రామ్ ఆ డైరక్టర్ తో...
జయీభవ చిత్రం పరాజయం తర్వాత కళ్యాణ్ రామ్ మొన్న సింహా పంక్షన్ లో తప్ప బయిట ఎక్కడా కనపడటం లేదు. అయితే ప్రస్తుతం కళ్యాణ్ రామ్ ఏం చేస్తున్నాడు అంటే...ఓ యాక్షన్ ధ్రిల్లర్ ని తన సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పై చేస్తూ బిజీగా ఉన్నారు. ఆ చిత్రానికి గతంలో కళ్యాణ్ రామ్ తో అభిమన్యు చిత్రం రూపొందించిన మల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం సిటీ ఔట్ స్కర్ట్స్ లో షూటింగ్ జరుపుకుంటున్నట్లు సమాచారం. ఇక ఎన్నో ఆశలు పెట్టుకుని నరేన్ అనే దర్శకుడుని పరిచయం చేస్తూ కళ్యాణ్ రామ్ రూపొందించిన జయీభవ భారీ నష్టం తేవటమే కాక ఇమేజ్ ని సైతం దెబ్బ తీసింది. దాంతో ఎలాగయినా హిట్టు కొట్టాలనే ఈ చిత్రాన్ని కసిగా చేస్తున్నట్లు చెప్తున్నారు. అలాగే ఈ చిత్రానికి పబ్లిసిటీ లేకుండాలో ప్రొపైల్ లో ఉంచుతున్నట్లు తెలుస్తోంది. ఇక వరసగా ఫ్లాఫ్ సినిమాలు ఇస్తున్న ఈ సారైనా అతనొక్కడే లాంటి హిట్ కొట్టాలని కోరుకుందాం.


Click it and Unblock the Notifications











