అప్పుడు అబ్బాయితో.. ఇప్పుడు బాబాయ్‌తో.. రొమాన్స్‌కు రెడీ అయిన హాట్ బ్యూటీ

ప్రతిష్టాత్మకంగా తీసిన ఎన్టీఆర్ బయోపిక్ ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో నందమూరి బాలకృష్ణ నిరాశ చెందారు. దీంతో ఈ సారి గట్టిగా కొట్టాలని డిసైడ్ అయిపోయారు. అందుకే గతంలో 'జై సింహా' వంటి హిట్ సినిమాను అందించిన కేఎస్ రవికుమార్‌తో నందమూరి బాలకృష్ణ మరోసారి జట్టుకట్టారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సీ కల్యాణ్ తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ఎప్పుడో పూర్తయ్యాయి. కానీ, షూటింగ్ మాత్రం ప్రారంభం కాలేదు. అయితే, హీరోయిన్ ఎంపిక పూర్తయిన వెంటనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

వాస్తవానికి ఈ సినిమాకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం ఫిలింనగర్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ సినిమాలో బాలయ్య రెండు షేడ్స్‌లో కనిపించబోతున్నాడని, అందులో ఒకటి పోలీస్ పాత్ర కాగా, మరొకటి గ్యాంగ్‌స్టర్ రోల్ అని గతంలో ప్రచారం జరిగింది. దీని తర్వాత ఈ సినిమా టైటిల్ విషయంలోనూ పలు వార్తలు వచ్చాయి. ఇక, ఈ మధ్య అయితే.. ఇందులో బాలయ్య సరసన 'RX100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్, సోనాల్ చౌహాన్ నటిస్తుందని ప్రచారం జరుగుతోంది. అయితే, తాజాగా ఈ సినిమా గురించి మరో వార్త బయటకు వచ్చింది.

Kalyan Ram Heroine will Romance With Nandamuri Balakrishna

ఈ సినిమాలో బాలయ్య సరసన సోనాల్ చౌహాన్ ఫిక్స్ అయిందట. ఈమె ఇప్పటికే బాలయ్యతో 'లెజెండ్', 'డిక్టేటర్' చిత్రాల్లో నటించింది. ఇప్పుడు మరోసారి జత కట్టబోతుందట. అలాగే, మరో హీరోయిన్‌గా వేదికను ఫైనల్ చేసిందట చిత్ర యూనిట్. ఈమె గతంలో కల్యాణ్ రామ్ సరసన 'విజయదశమి' అనే సినిమాలో నటించింది. అలాగే, లారెన్స్ 'ముని', నారా రోహిత్ 'బాణం'లో కూడా నటించి మెప్పించింది. ఇప్పుడు బాలయ్యతో నటించబోతుందని తెలుస్తోంది.

హీరోయిన్స్ ఫిక్స్ అవడంతో ఆగస్టు 7న బ్యాంకాక్‌లో సినిమా చిత్రీకరణ ప్రారంభించనున్నారని సమాచారం. సుమారు నెల రోజులు సాగే ఈ భారీ షెడ్యూల్‌లో రెండు పాటలు, రామ్‌ - లక్ష్మణ్‌ నేతృత్వంలో యాక్షన్‌ దృశ్యాలు, కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారనే టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X