కళ్యాణ్ రామ్ చివరకు మహేష్ రూట్ లోకే రాక తప్పలేదు
కళ్యాణ్ రామ్ చివరకు మహేష్ బాబు దారిలోకే వచ్చి తన చిత్రానికి "కళ్యాణ్ రామ్" కత్తి అనే టైటిల్ ని ఫిక్స్ చేసుకున్నారు. ఎందుకంటే తాను ముచ్చటపడి ఎంచుకున్న టైటిల్ 'కత్తి' టైటిల్ ని రవితేజ లాక్కెళ్ళిపోయాడు. తాజాగా రవితేజ,గుణశేఖర్ కాంబినేషన్ లో రెడీ కానున్న చిత్రానికి 'కత్తి' అనే టైటిల్ పెడుతున్నట్లు ప్రెస్ నోట్ విడుదలచేసారు. దాంతో కళ్యాణ్ రామ్ కి మింగుడుపడని పరిస్ధితి. ఎందుకంటే 'కత్తి' టైటిల్ దానయ్య రిజిస్టేషన్ చేసారు.దాంతో ఇక కళ్యాణ్ రామ్ తెగించి మహేష్ ఖలేజా రూటులోకి వచ్చి తన చిత్రానికి కళ్యాణ్ రామ్ కత్తి అని పెట్టి విడుదలకు రెడీ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం సంగీతం అక్టోబర్ 20 న విడుదల కానుంది. అలాగే చిత్రాన్ని నవంబర్ 5 న విడుదల చేస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా చెప్తున్నాడు.
మహేష్ బాబు రవితేజ కళ్యాణ్ రామ్ జూ ఎన్టీఆర్ గుణశేఖర్ మల్లి కత్తి mahesh babu ravi teja kalyan ram jr ntr gunashekar malli katti


Click it and Unblock the Notifications