twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కళ్యాణ్ రామ్ 'కత్తి'... టైటిలే కాదు...కథ కూడా కాపీనే

    By Srikanya
    |

    త్వరలో విడుదల కానున్న కళ్యాణ్ రామ్ తాజా చిత్రం కత్తి కాపీ కథ అంటూ అంతటా వినిపిస్తోంది. రిలీజ్ కాకుండానే ఈ టాక్ రావటం ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చగా మారింది. ఈ కత్తి చిత్రం కథ...పవన్ కళ్యాణ్ అన్నవరం చిత్రానికి కాపీ అంటూ వినపడుతోంది. లీకయిన కథ ప్రకారం ఓ గూండా ప్యామిలీకి కోడలిగా వెళ్ళిన తన చెల్లెలు(శరణ్యా మోహన్) కీ, బావ(కిక్ శ్యామ్) సేవ్ చేసే సేవే ఈ చిత్రంలో హీరో లక్ష్యం. తన ఎంతో ఇష్టపడి,కష్టపడి పెంచుకున్న చెల్లి సంతోషంగా,ప్రశాంతంగా ఉండాలంటే ఆ కుటుంబానికి ప్రత్యర్ధులు ఎవరూ ఉండకూడదు. అంతే కాక చెల్లి అత్తా,మామలుకు కూడా గూండాయిజం తప్పు అని బుద్ది రావాలి. అందుకోసం కళ్యాణ్ రామ్...ఆ ఇంటి పనోడుగా ప్రవేశించి తన ఐడెంటిటీ బయిటపెట్టకుండా సమస్యలు చక్కదిద్దుతాడు. ఊళ్ళో ఉన్న గూండాలందరినీ ఏరిపారేస్తూంటాడు. సెకెండాఫ్ మొత్తం రామ్ హిట్ చిత్రం రెడీ స్టైల్లో నడుస్తూ...అన్నవరంలాగ ఫైట్స్ తో నిండి ఉంటుందని తెలుస్తోంది. ఇక గుణశేఖర్ టైటిల్ ని కొట్టేసి తనదే అని కళ్యాణ్ రామ్ కత్తి అని వేసుకున్న కళ్యాణ్ రామ్ కథ కూడా ఎత్తేయటం విచిత్రమేనంటున్నారు. అలాగే పోస్టర్స్ కూడా హాలీవుడ్ చిత్రం నింజా ఎస్సైసైన్ నుంచి కాపీ కొట్టారంటున్నారు. ఇక ఈ చిత్రం ఏ మేరకు ప్రేక్షకులను అలరించనుందో చూడాలి. ఈ చిత్రం నవంబర్ 12న విడుదల కానుంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X